రాజ్ భవన్లో కేసీఆర్, చంద్రబాబు భేటీ: టీచర్స్ నిరసన

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో సచివాలయ ఉద్యోగుల పంపకాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం.

ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యంగా 12 అంశాల పైన చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు గంటన్నర పాటు భేటీ అయ్యారు. గవర్నర్ సమక్షంలో ఈ భేటీ జరిగింది.

Chandrababu, KCR meets in Raj Bhavan

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సభాపతులు, సీఎస్‌లు, క్యాంప్ ఆఫీస్ కార్యదర్శులు పాల్గొన్నారు. దాదాపు గంటన్నరకు పైగా సమావేశమైన వీరిద్దరూ పలు అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. సమావేశానికి ముందు చంద్రబాబు, కేసీఆర్ గవర్నర్‌తో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు.

మరోవైపు, రాజ్ భవన్ వద్ద ప్లకార్డులతో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా ఉపాధ్యాయులను స్వస్థలాలకు పంపాలని వారు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+