ఖబడ్దార్: బాబు, ఇలాంటి సభలో పాల్గొనాల్సి వస్తుందనుకోలేదు: కోనేరు హంపి

అమరావతి: లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫోక్సో చట్టం సవరణపై అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం అన్నారు. ఆడబిడ్డల జోలికి వెళ్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఆడపిల్లల జోలికి వెళ్తే ఉరిశిక్ష వేస్తారనే భయం రావాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్నారు.

ఆడపిల్లలకు రక్షణగా కదులుదాం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దాచేపల్లిలో బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు నిందితుడిని పట్టుకోవడానికి 17 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్లతోనూ గాలించామన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారు భూమి మీద ఉండడానికి వీల్లేదన్నారు.

ప్రస్తుతం సమాజంలో టెక్నాలజీ బాగా అందుబాటులో ఉందని, మంచిగా వాడుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో చిన్నపిల్లలు తప్పుడు దారుల్లో వెళుతున్నారని, మనందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతోన్న దారుణాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాచేపల్లి లాంటి ఘటన అదే చివరిది కావాలని, మరోసారి ఇటువంటి ఘటన జరిగితే నిందితులకు అదే చివరి దినం కావాలన్నారు.

Chandrababu and Koneru Hampy participates in Adapillaku Andaga Undam

ఇలాంటి సభలో పాల్గొనవలసి వస్తుందని తాను ఊహించలేదని ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అన్నారు. టీవీ చూస్తే ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందోనని భయంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటలు జరగకుండా చూడాలన్నారు. సాంకేతికత మంచిదే కాదనీ, దురదృష్టకర ఘటనల వైపు మళ్లకుండా చూసుకోవాలన్నారు.

బాలికలను, మహిళలను చూడాల్సిన కోణంలో, ఆ మార్పు మన ఇంటి నుంచి రావాలని సామాజిక కార్యకర్త సునితా కృష్ణన్ అభిప్రాపడ్డారు. అత్యాచారాలు స్త్రీల సమస్య కాదని, అది మగవాళ్ల మానసిక సమస్య అన్నారు. రాష్ట్రంలో చిన్నారులకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+