హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుపై ఫైర్: బాబును గార్డ్స్‌చుట్టేశారు, నిరీక్షణ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన నియోజకవర్గమైన కుప్పంలోని శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో పర్యటించి, పలు సభల్లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల పైన మండిపడ్డారు. కొంతకాలం క్రితం ఓ సినీ నటుడు సామాజిక న్యాయం అంటూ రాజకీయ పార్టీ స్థాపించి ఆ తర్వాత తన పార్టీని విలీనం చేశారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన మండిపడ్డారు.

విభజన అంశంపై కూడా మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ రాజకీయ లబ్ధి కోసమే విభజన చేస్తోందని ధ్వజమెత్తారు. దానికి జగన్ పార్టీ, ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని ఆరోపించారు.

బాబు 1

బాబు 1

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో సోమవారం ఆయన సభల్లో ప్రసంగించారు.

బాబు 2

బాబు 2

'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడమే కాక, రాజకీయాలపై నిస్తేజాన్ని వీడి అవినీతి కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను భూస్థాపితం చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని యువతకు దిశానిర్దేశం చేశారు.

బాబు 3

బాబు 3

రాష్ట్ర విభజన కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారంటూ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను తూర్పారబట్టారు.

బాబు 4

బాబు 4

అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం చూపిన తర్వాతే విభజన గురించి ఆలోచించాలని, ఏకపక్షంగా ముందుకుపోతే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని హెచ్చరించారు.

బాబు 5

బాబు 5

తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏ ఒక్క తెలుగువాడి గౌరవానికీ భంగం కలగకుండా చూడడానికి టిడిపి కంకణం కట్టుకుందన్నారు.

బాబు 6

బాబు 6

ఈ నెల 21న తిరుమలేశుని దర్శనం చేసుకుని, అదేరోజు తిరుపతిలో జరిగే సభలో కాంగ్రెస్, జగన్ పార్టీ, టీఆర్ఎస్‌ల కుతంత్రాలను బయటపెడతానని చెప్పారు.

బాబు 7

బాబు 7

ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ పోరాటం సాగిస్తున్న టిడిపి ఘన విజయం సాధించి తీరుతుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

బాబు 8

బాబు 8

పంచాయతీ ఎన్నికల్లో టిడిపి ప్రభంజనంతో జడుసుకున్న కాంగ్రెస్ దీనికి అడ్డుకట్ట వేయడానికే రాష్ట్ర విభజనను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.

బాబు 9

బాబు 9

ఇందుకు పనికిరాని పుత్రుడు చవఎం కిరణ్‌తో లాభంలేదనే దత్తపుత్రుడు జగన్, అద్దె పుత్రుడు కెసిఆర్ అండగా తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం ఎత్తులు వేస్తోందన్నారు.

బాబు 10

బాబు 10

జిత్తులమారి జగన్ ఎత్తులను చిత్తు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీమాంధ్రలో 110 రోజులుగా ఆందోళన సాగుతుంటే పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత సోనియాకు లేదా అని నిలదీశారు.

బాబు 11

బాబు 11

హైదరాబాద్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేసిన టిడిపికే ఆ నగరం గురించి మాట్లాడే హక్కుంటుంది తప్ప మరే పార్టీకీ లేదని చంద్రబాబు అన్నారు.

బాబు 12

బాబు 12

ప్రపంచమంతా తిరిగి అనేక కంపెనీలను రప్పించింది.. హైటెక్‌గా తీర్చిదిద్దిందీ, యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికేనన్నారు.

బాబు 13

బాబు 13

మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన తనకు రైతుల, కూలీల కష్టాలు తెలుసునని, బడుగుల బతుకుల్లోని వేదన కూడా అనుభవమేనని, వారి కష్టాలను తొలగించడానికి తగిన ప్రణాళికలు తన మదిలో ఉన్నాయని చెప్పారు.

బాబు 14

బాబు 14

అధికారంలోకి వస్తూనే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని, వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని, బిసి డిక్లరేషన్ అమలు చేసి తీరతానని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

బాబు 15

బాబు 15

సామాజిక న్యాయమంటూ వచ్చిన ఒక సినీ నటుడు చరిత్రలో మిగలకుండా పోయారని, మళ్లీ అటువంటివారిని నమ్మరాదని సూచించారు.

బాబు 16

బాబు 16

రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను భూస్థాపితం చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

బాబు 17

బాబు 17

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో సోమవారం ఆయన సభల్లో ప్రసంగించారు.

బాబు 18

బాబు 18

నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో సోమవారం ఆయన సభల్లో ప్రసంగించారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu on Monday said he want to become Chief Minister of Andhra Pradesh.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X