చంద్రబాబు తొడ గొట్టాడు: అమీర్ ఖాన్‌తో కలిసి చూశాడు
విశాఖపట్నం: ఎల్లవేళలా గంభీరంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుననాయుడు తొడగొట్టారు. ఎవరినో సవాల్ చేస్తూ ఆయన తొడ గొట్టలేదు. కబడ్డీ క్రీడాకారులను ఉత్సాహపర్చేందుకు ఆయన అలా చేశారు.
విశాఖపట్నంలో ప్రో కబడ్డీ లీగ్ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుటైటాన్స్-యు ముంబ జట్ల మధ్య నిర్వహించిన ప్రారంభ మ్యాచ్‌ను సినీ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఆయన తిలకించారు.

పోటీల సందర్భంగా తొడగొట్టి క్రీడాకారులను ఆయన ఉత్సాహపరిచారు. తెలుగు టైటాన్స్ జట్టే విజేతగా నిలుస్తుందన్నారు. అమరావతిలో అంతర్జాతీయ క్రీడానగరాలను నిర్మిస్తామన్నారు.

ఏపీ రాజధానిలో ఒలింపిక్స్ నిర్వహించడమే తన లక్ష్యమన్నారు. భవిష్యత్తులో అమరావతిలో నిర్వహించే ఒలింపిక్స్‌లో కబడ్డీ కూడా ఉంటుందని ఆశావాహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications