రామోజీ పాడె మోసిన చంద్రబాబు - ఎమోషనల్..!!

రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీ రావుకు పలువురు అశ్రు నివాళి అర్పించారు. రామోజీ అంతిమ యాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రామోజీ పాడెను చంద్రబాబు మోసారు. అధికార లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారం ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు.

రామోజీ అంతిమయాత్ర
రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీ రావు అంతిమ యాత్రలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రామోజీ ఫిల్మ్​సిటీలోని తన నివాసం నుంచి స్మృతి కట్టడం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. రామోజీరావు అంతిమ యాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణతోతో సహా పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్​సిటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాంది. పోలీసుల గౌరవ వందనం అనంతరం రామోజీరావు అంతిమ యాత్ర ప్రారంభించారు.

Chandrababu lends his hand in Ramoji raos final rites

పాడె మోసిన చంద్రబాబు
రామోజీ అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. రామోజీ పాడె మోసిన చంద్రబాబు తన గౌరవం చాటుకున్నారు. రామోజీ మరణం తరువాత పలువురు ప్రముఖులు ఫిల్మ్ సిటీకి వచ్చి రామోజీకి నివాళి అర్పించారు. ప్రధాని మోదీ రామోజీ చేసిన సేవలను కొనియాడారు. రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. కుటుంబసభ్యులు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు తెలిపారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది.

ప్రముఖుల అశ్రు నివాళి
రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరిగాయి. అటు ఏపీ ప్రభుత్వం రామోజీ మరణంతో రెండు రోజుల పాటు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని పలువురు ఓదార్చుతూ కనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రామోజీ అంతిమ సంస్కారంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం కు హాజరు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+