మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ కు చంద్రబాబు గుడ్ న్యూస్-ఉత్తర్వులు జారీ..!

ఏపీలో 2015-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబుకు పీఎస్ గా వ్వవహరించిన పెండ్యాల శ్రీనివాస్ కు ఇప్పుడు మరోసారి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఓ దశలో అమెరికా వెళ్లిపోయిన ఆయనకు ఇవాళ చంద్రబాబు ఈ శుభవార్త అందించారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఆయనపై కొనసాగుతున్న విచారణను సైతం నిలుపుదల చేశారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో పీఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ కక్షతో గత వైసీపీ ప్రభుత్వం ఆయన్ను పూర్తిగా టార్గెట్ చేసింది. ఆయనపై పలు ఆరోపణలతో సస్పెండ్ కూడా చేసింది. అంతే కాదు ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కూడా ఆదేశించింది. ఈ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Chandrababu lifts suspension on ex pa pendyala Srinivas ordered to stop ongoing inquiry also

పెండ్యాల శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తేయడంతో పాటు ఆయనపై జరుగుతున్న విచారణను కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయనపై గతంలో విధించిన సస్పెన్షన్ ను ఎత్తేస్తూ ఇవాళ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఆయన సస్పెన్షన్ లో ఉన్న కాలాన్ని సైతం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు పెండ్యాల శ్రీనివాస్ ను సర్వీస్ లోకి తిరిగి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఆయనకు ఏ పోస్టు ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+