స్విట్లర్లాండ్ లో బాబు, లోకేష్ పెట్టుబడుల వేట..! రాయబారి ముందు చిట్టా..!

దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. ఇవాళ స్విట్లర్లాండ్ లోని జురిక్ చేరుకున్నారు. స్విట్లర్లాండ్ లో పారిశ్రామిక వేత్తలు, అక్కడి భారత రాయబారి, ఇతర కీలక వ్యక్తుల్ని కలిసి పెట్టుబడుల వేట మొదలుపెట్టేశారు. ఏపీలో ఏయే పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో వివరించడంతో పాటు , స్విట్లర్లాండ్ పారిశ్రామిక వేత్తల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే అంశాల్ని తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

స్విట్జర్లాండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై ఆయనతో వీరిద్దరూ చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్ ను చంద్రబాబు కోరారు.

Chandrababu Lokesh investment hunt in Switzerland key talks with Indian ambassador

ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్-ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నిలకల్ టెక్స్ టైల్స్, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు వంటి రంగాల్లో తమకు సహకరించాలని రాయబారిని చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ తెచ్చిన పాలసీలను... పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. సీఎం చంద్రబాబు 2025లో చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ అయిందని, సుమారు రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని మృదుల్ కుమార్ గుర్తుచేశారు. ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసే విధంగా కృషి చేయాలని సీఎం మృదుల్ కుమార్ ను కోరారు. అనంతరం లిచ్టెన్ స్టైన్ అనే దేశంలో జరుగుతున్న ఏఐ ప్రగతికి సంబంధించిన వివరాలను సీఎంకు ఆయన వివరించారు. నేడు ఏ దేశంలోకి వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయని, ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరులకొరతతో ఉన్నాయని చంద్రబాబు ఆయనకు తెలిపారు.

Chandrababu Lokesh investment hunt in Switzerland key talks with Indian ambassador

భారత దేశం యువశక్తితో సిద్దంగా ఉందని, ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుందని వెల్లడించారు. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిదాయకంగా ఉందని, ఫిబ్రవరిలో భారత్ లో జరిగే ఏఐ సదస్సులో లిచ్టెన్ స్టైన్ ప్రతినిధులతో సమావేశమవుతానని చంద్రబాబు తెలిపారు. అనంతరం లోకేష్.. స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి సహకరించాలని రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలన్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సన్నద్దంగా ఉందని, యువతకు నైపుణ్యంలో శిక్షణను కల్పిస్తున్నామని, 100 కేజీల బరువు మోసే డ్రొన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, వాటిని కనెక్ట్ చేస్తామన్నారు. బీ టు బీ ద్వారా ఈ పెట్టుబడులను సాకారం చేద్దామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+