5కిలోలు బరువు తగ్గిన చంద్రబాబు; ఆయన ప్రాణాలు ప్రమాదంలో: లోకేష్, భువనేశ్వరి ఆందోళన!!
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒకవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్ మరియు భువనేశ్వరి చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని, చంద్రబాబుకు ఏదైనా జరిగితే అందుకు జగన్ ప్రభుత్వమే కారణమంటూ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు జీవితానికి కాదనలేని మరియు తక్షణ ముప్పు ఉందని పేర్కొన్నారు. చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. చంద్రబాబు భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో ఉందని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు దోమలు, కలుషితమైన నీరు, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో, కనీసం సకాలంలో వైద్య సహాయాన్ని కూడా పొందకుండా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆయనకు స్టెరాయిడ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని, ఆయన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ వైద్యులు మరియు ప్రభుత్వం ఏమి దాచటానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక మరోవైపు నారా భువనేశ్వరి కూడా భర్త ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఎమర్జెన్సీ వైద్యాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. జైలులో చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని, ఇప్పటికే ఆయన ఐదు కిలోలు బరువు తగ్గారని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
ఇంకా చంద్రబాబు బరువు తగ్గితే ఆయన కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఆయన తాగే నీరు అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కావాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రగా, చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బ తీయడానికి జరుగుతున్న పన్నాగంగా భువనేశ్వరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications