చంద్రబాబు ఆ సీక్రెట్ చెప్పడానికి ఇంకా టైముందా ? బీజేపీకి కోపం రాకూడదంటే..!
ఏపీలో 2019 ఎన్నికల సమయంలో బీజేపీపై ధర్మపోరాటం చేసి విఫలమైన చంద్రబాబు ఆ తర్వాత నుంచి ఆ పార్టీ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మధ్యమధ్యలో కేంద్రానికి పలుమార్లు మద్దతిస్తూ తన విధేయతను చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం కరుణించకపోవడంతో ఇక అంతా అయిపోయుందని భావిస్తున్న తరుణంలో బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం ఆ విషయం బయటపెట్టడం లేదు.దీని వెనుక కీలక కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
Recommended Video

ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అపసోపాలు పడుతున్న టీడీపీ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో మళ్లీ చేరడం ద్వారా బలోపేతం కావాలని ఆశిస్తోంది. గతంలో 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో విభేధించి ఎన్డీయే నుంచి బయటికి వచ్చి మోడీపై ధర్మపోరాటం చేసిన చంద్రబాబు ఆ తర్వాత తప్పు తెలుసుకున్నారు.
దీంతో బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇవి ఫలించలేదు. కానీ బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు అవసరం రావడంతో ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా హైదరాబాద్ వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో జరిపిన భేటీలే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ ఎప్పుడన్నది తేలలేదు.

దసరాలోపే అంటూ జాతీయ మీడియాలో ప్రచారం
ఎన్డీయేలోకి టీడీపీ రీ ఎంట్రీ పై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్ధాయిలోనూ జోరుగా చర్చ సాగుతోంది. అందులోనూ జాతీయ మీడియాలో అయితే ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమేనని, అదీ దసరాలోపే జరుగుతుందని రిపబ్లిక్ టీవీతో పాటు పలు మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమైతే చోటు చేసుకోబోయే పరిణామాలపై చర్చలు పెరుగుతున్నాయి. ముందుగా తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు ప్రకటన ఉంటుందని, ఆ తర్వాత కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రి పదవులు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

చంద్రబాబు వ్యూహాత్మక మౌనం
ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీకి సంబంధించి తెరవెనుక జరుగుతున్న ప్రచారంపై మీడియా తాజాగా చంద్రబాబును నేరుగా ప్రశ్నించింది. అయితే చంద్రబాబు మాత్రం దీనిపై నేరుగా స్పందించలేదు. ఆ ప్రచారం చేసే వారినే అడగాలంటూ చెప్పి తప్పించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించే పార్టీలకే మద్దతు అంటూ వ్యూహాత్మకంగానే సంకేతాలు ఇచ్చేసారు. దీంతో ఏపీకి సంబంధించి బీజేపీతో కొన్ని ప్రకటనలు చేయించి ఆ తర్వాత టీడీపీ ఎన్డీయేలోకి రీ ఎంట్రీ ఇవ్వొచ్చన్న సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు. అయితే రీ ఎంట్రీ ఎప్పుడన్నది మాత్రం చెప్పడం లేదు.

బీజేపీ గ్రీన్ సిగ్నల్ రాగానే ?
తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి టీడీపీతో పొత్తు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్ వంటి హీరోలతో ప్రచారం, రామోజీరావు మీడియా మద్దతు వంటి అంశాలతో భారీ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అన్నింటికీ మించి చంద్రబాబుతో మరోసారి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారనే దానికి తనదైన శైలిలో వాదన కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇవన్నీ పూర్తయ్యే వరకూ చంద్రబాబు కూడా నోరుమెదిపే పరిస్దితి లేదు. ఓసారి ప్లాన్ సిద్ధమైన తర్వాత చంద్రబాబు, బీజేపీ విడివిడిగా లేదా ఉమ్మడిగా దీనిపై ప్రకటన చేయొచ్చని చెప్తున్నారు. అంతవరకూ ఈ ప్రచారంపై చంద్రబాబు మౌనమే సంకేతంగా భావించాల్సి ఉంటుంది.
-
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
భారీ ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు - ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!! -
దంచి కొడుతున్న ఎండల వేళ భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్-కేబినెట్లో మంత్రులతో సీఎం..! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications