నంద్యాల కోసం చంద్రబాబు రాయబారం, జగన్‌కు నో ఛాన్స్!

నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా టిడిపి నంద్యాల అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డిని వైసిపి అధినేత జగన్ వద్దకు పంపించనున్నారని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత వద్దకు పంపించాలని అధినేత యోచిస్తున్నారు.

అది పాటిద్దాం

అది పాటిద్దాం

గత సంప్రదాయం ప్రకారం ఉప ఎన్నికల్లో ముందుకు వెళ్దామని టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ద్వారా జగన్‌కు చంద్రబాబు చెప్పనున్నారని తెలుస్తోంది. ఎవరైనా చనిపోతే, వారి స్థానంలో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ పెట్టకూడదనే సంప్రదాయం ఉందని, దాని ప్రకారం ముందుకు వెళ్దామని చంద్రబాబు వర్తమానం పంపించనున్నారని తెలుస్తోంది.

కానీ, శిల్పాకు మొండి చేయి చూపే అవకాశాల్లేవు

కానీ, శిల్పాకు మొండి చేయి చూపే అవకాశాల్లేవు

ఇప్పటికే అఖిలప్రియ, భూమా కుటుంబ సభ్యులు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. కానీ చంద్రబాబు రంగంలోకి దిగినా జగన్ పోటీ విషయంలో తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. భూమా కుటుంబం తనను కాదని వెళ్లడంతో నంద్యాలలో పోటీకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు, శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. కాబట్టి చంద్రబాబు విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించే అవకాశాల్లేవని అంటున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడారు. టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డిని ప్రకటించామని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, ఈ విషయమై వైసిపికి విన్నపం చేశామని, వారి నుంచి ఇంకా స్పందన రాలేదన్నారు.

నంద్యాలలో టిడిపి గెలుపు ఖాయం

నంద్యాలలో టిడిపి గెలుపు ఖాయం

నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం కాకపోయినా, వైసిపి పోటీకి నిలిచినా టిడిపి ఘనవిజయం సాధించడం ఖాయమని టిడిపి నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు కూడా ధీమాగా ఉన్నారు. నంద్యాల నియోజకవర్గంలో టిడిపి పార్టీ పటిష్టంగా ఉందన్నారు. గతంలో వైయస్ చనిపోయినప్పుడు, ఆ తర్వాత పలు సందర్భాల్లో ఏకగ్రీవం అయ్యాయని, ఇప్పుడు కూడా జగన్ అందుకు సహకరించాలని మంత్రి అఖిలప్రియ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+