రూ.1600 కోట్లు ఖర్చు పెట్టా.. ఇవ్వండి, అమరావతికీ: జైట్లీతో బాబు
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు కోసం తాము రూ.1600 కోట్లు ఖర్చు పెట్టామని, ఆ నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు విజ్ఞప్తి చేశారు. చైనా పర్యటన నుంచి ఆయన ఢిల్లీ వచ్చారు.
బాబుతో కలిసి కూర్చో: కేసీఆర్‌కు రాజప్ప, ఈడీ ఆటాచ్‌పై జగన్‌కు చురక
ఈ రోజు ఆయన ఢిల్లీలో జైట్లీని కలిశారు. విభజన నేపథ్యంలో ఏపీ ఇబ్బందుల్లో ఉందని, రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. నిధుల మంజూరును వేగవంతం చేయాలన్నారు. తొలి ఏడాది ఏపీకి ఉన్న రూ.13వేల కోట్ల ద్రవ్యలోటును భర్తీ చేయాలన్నారు. అలాగే, రాజధాని నిర్మాణం కోసం నిధులను ఇవ్వాలని కోరారు. పోలవరం కోసం ఖర్చు చేసిన నిధులను అడిగారు.

చంద్రబాబుతో హరిబాబు భేటీ
ఏపీ సర్కార్ కి ఊహించని షాక్ : జాతీయ నివేదికలో నివ్వెరపోయే విషయాలు.
సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడలో గుడులను కూలగొట్టిన అంశంపై చర్చించారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ.. కూల్చివేసిన మందిరాలను ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని హరిబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications