బిజెపి, టిడిపికి ఎక్కువ సీట్లు: మోడీ హవా అంతంతే!
హైదరాబాద్: రాష్ట్రంలోని సీమాంధ్రలో టిడిపి, బజెపి కూటమికే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు అవుట్‌లుక్‌లో వచ్చిందని ప్రముఖ తెలుగు దినపత్రికలో కథనం వచ్చింది. తెలంగాణలో మాత్రం మూడు సీట్లు మించదట. దేశ వ్యాప్తంగా ఎన్డీయేకే ఎక్కువ సీట్లు లభించనున్నాయట. దేశంలో అనుకున్నంత మోడీ ప్రభంజనం లేదని, అయితే ఎక్కువ స్థానాలు ఎన్డీయేనే గెలుచుకోనుందట.
అవుట్‌లుక్ అంచనా నిజమైతే, ఎన్డీయే కొత్త మిత్రపక్షాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. సమాచారం మేరకు.. అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌లతో ఇప్పటికే బిజెపి నేతలు చర్చలు జరుపుతున్నారట. టిడిపి, బిజెపిలతో పొత్తు విషయంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధానమంత్రి ఐకె గుజ్రాల్ సోదరుడు సతీశ్ గుజ్రాల్ ఇప్పటికే జయలలిత, నవీన్‌లతో మంత్రాంగం జరిపారట.

సీమాంధ్రలో బిజెపితో పొత్తు వల్ల లోకసభలో చెప్పుకోదగ్గ ఫలితాలే రానున్నాయట. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కడా మోడీ ప్రభంజనం లేదట. తెలంగాణలో స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నా, టిడిపితో పొత్తుపెట్టుకుని బిజెపి ఘోర తప్పిదానికి పాల్పడిందని, అదే సమయంలో బిజెపి విభజనకు మద్దతునిచ్చినందువల్ల సీమాంధ్రలో చంద్రబాబుకు నష్టం జరిగిందని అభిప్రాయపడింది. యూపిలో కాంగ్రెసు పార్టీ కోల్పోయే సీట్లు దాదాపు బిజెపికే దక్కనున్నాయట.












Click it and Unblock the Notifications