తెలంగాణ తరహాలో ఏపీలో ఎన్నికలు: చంద్రబాబు, పవన్ డిమాండ్: ఈసీతో భేటీ సారాంశం అదే

Chandrababu Naidu and Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీలో అడుగు పెట్టారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ విజయవాడకు చేరుకున్నారు.

తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. వారిని కలిశారు. ఏపీలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకుంటోన్న మార్పులు చేర్పులపై ఫిర్యాదు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

Chandrababu Naidu and Pawan Kalyan met CEC Rajeev Kumar

వారితో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై అనేక కేసులను పెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల ఇప్పుడు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో వేలాది ఓట్లను తొలగించారని విమర్శించారు. ఆయా పరిణామాలన్నింటినీ తాము కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.

Chandrababu Naidu and Pawan Kalyan met CEC Rajeev Kumar

టీడీపీ-జనసేన నేతలపై ఆరువేలకు పైగా కేసులు నమోదయ్యాయని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఎవరినీ పని చేయనివ్వకుండా నిర్వీర్యం చేస్తోన్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని, అలాంటి వాతావరణంలో ఏపీలో ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ఎన్నికల పరిశీలకులు, ఇతర భద్రత బలగాలను ఏపీకి పంపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ సెల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా కూడా తాము ఈసీ దృష్టికి తీసుకెళ్తామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడే వారిపై అవసరమైతే కోర్టుకు వెళ్లి శిక్ష పడేలా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పొరుగు రాష్ట్రాల్లో నివసించే వారికి ఏపీలో ఓటు హక్కు కల్పించొద్దనడం సరికాదని వ్యాఖ్యానించారు. రెండు చోట్లా ఓటు ఉండటం నేరమే అయినప్పటికీ.. వేరే రాష్ట్రాల్లో ఓటు హక్కు లేకపోతే ఏపీలో కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+