వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అంతా జరుగుతోందా?: కేంద్రం నిర్ణయంపై చంద్రబాబు ప్రశంసలు, ఏపీపై ఒకే మాట

|
Google Oneindia TeluguNews

అమరావతి: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తన్నారు. దేశ ప్రజలు, వాహనదారులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం నిర్ణయంపై చంద్రబాబు ప్రశంసలు

కేంద్రం నిర్ణయంపై చంద్రబాబు ప్రశంసలు

పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించి ప్రజలను ఆదుకున్న కేంద్ర ప్రభుత్వంపై నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రశంసలు కురిపించారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర స్థాయి పన్నులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పిలుపునివ్వడాన్ని చంద్రబాబు స్వాగతించారు.రాజస్థాన్, ఒరిస్సా, తమిళనాడు ప్రభుత్వాలు ఇంధనంపై తమ పన్నులను తగ్గించాయని ఎత్తి చూపిన టీడీపీ అధినేత.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిని అనుసరించాలని డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యల నేపథ్యంలోనే చంద్రబాబు స్పందన

పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యల నేపథ్యంలోనే చంద్రబాబు స్పందన

వచ్చే ఎన్నికలకు బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తుకు అంగీకరించేలా బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని బహిరంగ సభలో సూచించిన తర్వాత.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇదే విధమైన ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు. అయితే, దీనిపై బీజేపీ నేతలు స్పందించలేదు.కాగా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. విభజన జరిగితే 2024లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం ఖాయమన్నారు పవన్ కళ్యాణ్.

కేంద్రం నిర్ణయంపై అభినందనీయమంటూ పవన్ కళ్యాణ్

కేంద్రం నిర్ణయంపై అభినందనీయమంటూ పవన్ కళ్యాణ్

'పెరుగుతున్న ధరలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ఉపశమనం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.9.50, రూ.7 చొప్పున తగ్గించడం అభినందనీయం' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 'బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో, కొంతమేరకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నందున, దిగువ-ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఉపశమనం పొందవచ్చని నేను భావిస్తున్నాను. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గింపు కచ్చితంగా పేదలకు మేలు చేస్తుంది' అని అన్నారు పవన్ కళ్యాణ్.

ఏపీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ది ఒకే మాట

ఏపీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ది ఒకే మాట

ధరలు తగ్గించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వంతు అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ అన్నారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిందని వారు తెలిపారు. "కేంద్రం పిలుపుకు చాలా రాష్ట్రాలు స్పందించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా అనుసరించాలని చంద్రబాబు అన్నారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పన్నులు తగ్గించాలని కోరుకుంటున్నాను. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తమ వాహనాలకు మరమ్మతులు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత అధ్వాన్నంగా ఉన్నా రోడ్డు మరమ్మతులు చేపట్టడం లేదు. పెట్రోలు, డీజిల్‌పై స్థానిక సెస్‌ని తగ్గించి వారికి ఉపశమనం కల్పించాలన్న ప్రజల డిమాండ్‌లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను' అని పవన్ కల్యాణ్ అన్నారు.

English summary
Chandrababu Naidu, Pawan Kalyan praise BJP for fuel price cuts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X