'కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి' (ఫోటోలు)

హైదరాబాద్: గతంలో జరిగిన ఒక ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయి గతంలో తన చొరవతో సర్జరీ చేయించుకున్న నిరుపేద యువతి కట్టా లక్ష్మీకి అవసరమైన సహాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం యడ్లపాలెం గ్రామానికి చెందిన కట్టా లక్ష్మీ తన తల్లితో కలిసి ఉంటుంది.

రెండు నెలల క్రితం ఆమె ప్రమాదవశత్తూ కిందపడి రెండు కాళ్లూ పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. కాళ్లు రెండూ తీసేయాల్సిందేనని స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యుల చెప్పడంతో చేసేదిలేక ఆమె ముఖ్యమంత్రిని కలిసి తన గోడు చెప్పుకుంది. ఆమె దీనస్థితి తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే లక్మ్మిని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చించి తగిన వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయించారు.

కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆమె కాళ్లలో రాడ్స్ అమర్చి సర్జరీ చేసి పంపించారు. అప్పటినుంచి ఆమె హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రి ఆవరణలోనే కాలం గడుపుతోంది. తిరిగి తన ఊరు వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో ఆమె మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన దీనస్థితిని వివరించింది.

దాంతో చలించిపోయిన సీఎం లక్ష్మీ కుటుంబానికి తక్షణమే చేయూత అందించాలని అధికారులను ఆదేశించారు. లక్మ్మీ సొంత ఊరు వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, ఆమె తల్లికి పెన్షన్ వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. లక్మ్మి తన కాళ్లపై తను నిలబడేలా ఉపాధి మార్గం చూపాలని చెప్పారు. సీఎం చూపిన ఔదార్యానికి లక్మ్మి, ఆమె తల్లి ధన్యవాదాలు తెలిపారు.

 కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

గతంలో జరిగిన ఒక ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయి గతంలో తన చొరవతో సర్జరీ చేయించుకున్న నిరుపేద యువతి కట్టా లక్ష్మీకి అవసరమైన సహాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

 కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

తన ఊరు వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో ఆమె మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన దీనస్థితిని వివరించింది.

కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

దాంతో చలించిపోయిన సీఎం లక్ష్మీ కుటుంబానికి తక్షణమే చేయూత అందించాలని అధికారులను ఆదేశించారు. లక్మ్మీ సొంత ఊరు వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, ఆమె తల్లికి పెన్షన్ వచ్చేలా చూడాలని సీఎం సూచించారు.

 కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

కాళ్లు కోల్పోయిన కట్టా లక్మ్మికి ఉపాధి: సీఎం బాబు

లక్మ్మి తన కాళ్లపై తను నిలబడేలా ఉపాధి మార్గం చూపాలని చెప్పారు. సీఎం చూపిన ఔదార్యానికి లక్మ్మి, ఆమె తల్లి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి పదికాలాలపాటు పచ్చగా వుండాలని ఆమె అభిలషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+