అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై మంత్రి బొత్స మండిపాటు.. ‘రాజధాని’ కమిటీ నివేదికపై పూటకో మాట, రోజుకో వైఖరి అంటూ

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతారని గుర్తుచేశారు. అభివృద్ధి కోసం వికేంద్రీకరణ చేపడితే జీఎన్ రావు కమిటీ, బీసీజే కమిటీలు ఇచ్చిన రిపోర్టులను బోగీ మంటల్లో పడేసి కాల్చివేయాలని కోరారన్నారు. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశారు. ఈ రోజు పత్రికలు పతాక శీర్షికలో విశాఖకు రాజధాని వద్దు ముప్పు ఉందని ఆ కమిటీ చెప్పిన అంశాన్ని రాయడంతో.. తన అభిప్రాయం మార్చుకున్నట్టు ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు.

అప్పుడు అలా..

అప్పుడు అలా..


పత్రికల్లో వాతావరణ రీత్యా మంచిది కాదు, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అని కథనాలు రావడంతో కమిటీలపై చంద్రబాబుకు గౌరవం పెరిగినట్టుంది అని చెప్పారు. వికేంద్రీకరణ చేయాలని జీఎన్ రావు, బీసీజే కమిటీలు చెప్పాయి కదా.. వారు చెప్పిన వికేంద్రీకరణ వద్దు అని.. వైపరీత్యాలను మాత్రం తెరపైకి తీసుకొస్తారా అని ప్రశ్నించారు. ఒక అంశంపై అభిప్రాయం ఎందుకు మారుతోంది అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

మండలిపై కూడా..

మండలిపై కూడా..


శాసనమండలి రద్దుపై కూడా చంద్రబాబు ఇదే విధానం అవలంభిస్తున్నారని చెప్పారు. రద్దు చేసే సమయంలో ఇప్పుడు వద్దని లేని ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. 2004లో ఏర్పాటు చేసే సమయంలో ఎందుకు వద్దన్నారని అడిగారు. 1985, 1987లో కూడా ఇదే విధానం తెలియజేశారని విమర్శించారు. తనది రెండు నాలుకల ధోరణి అని చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకున్నారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కాంట్రాక్టర్లు, వ్యాపారస్తుల కోసమే

కాంట్రాక్టర్లు, వ్యాపారస్తుల కోసమే

తమ ప్రభుత్వం జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామే తప్ప.. చంద్రబాబు మాదిరిగా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను పక్కనపెట్టి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అప్పుడు చెత్తబుట్టలో పడేసిన కమిటీ రిపోర్ట్ నేడు భగవద్గీత అయ్యిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాటల్లో నిలకడలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

English summary
tdp chief chandrababu naidu attitude change in every day minister botsa satyanarayana said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X