మా ప్రధాని, ఏపీకి సంబంధాలు: రష్యాలో మోడీపై బాబు ప్రశంస

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: భారత్ - రష్యా సంబంధాలు దృఢంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ నిర్వహించిన ఇన్నోప్రోమ్-2016 సదస్సులో పాల్గొని, కీలక ఉపన్యాస‌ం చేశారు. భారత్ - రష్యా సహజ మిత్రులన్నారు.

నేడు అమరావతిలా, నాడు ఆస్తానా కష్టాలు: పట్టుబట్టి బాబుని పంపిన మోడీ

ఇరు దేశాల మధ్య పరస్పర సంబంధాలను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించారన్నారు. భారత్‌ ప్రాధాన్యాన్ని చాటుతూ ప్రధాని మోడీ ప్రపంచమంతా చుట్టి వస్తున్నారని పేర్కొన్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే రెండంకెల వృద్ధిరేటు సాధిస్తుందన్నారు.

ఏపీతోను రష్యా సంబంధాలు చారిత్రాత్మకమైనవన్నారు. ఏపీ నుంచి రష్యాకు అత్యధికంగా పొగాకు ఎగుమతులు ఉండేవని గుర్తు చేశారు. సుదీర్ఘ తీర ప్రాంత అభివృద్ధికి రష్యాతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

Chandrababu Naidu begins Russia visit

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామి కావాలని రష్యాకు పిలుపునిచ్చారు. రెండేళ్ల శిశువైన ఏపీ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజె పాల్గొన్నారు.

కాగా, అంతకుముందు చంద్రబాబు రష్యా వాణిజ్య శాఖ మంత్రి డేనిస్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల అంశాల గురించి డెనిస్‌కు చంద్రబాబు వివరించారు. ఏపీ వేగంగా వృద్ధిని నమోదు చేస్తోందన్నారు.

ఇంత తక్కువా, బాబు రహస్యం ఏమిటో?: మోడీ ఆరా!
తాము రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధికి తమతో కలిసి పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం గురించి మంత్రి డేనిస్.. చంద్రబాబు నుంచి ఆరా తీశారు. త్వరలో తాను అమరావతి వస్తానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu begins Russia visit.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి