జగన్! నా సవాల్‌కు సిద్ధమేనా?: ఏకిపారేసిన బాబు, పవన్ నిర్ణయంపై ఇలా..!
నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం చంద్రబాబునాయుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ తన పార్టీ ఎంపిలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే తాము అక్కడ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు.
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో ఉత్సాహంగా మాట్లాడారు.

జగన్! నా సవాల్‌కు సిద్ధమేనా?
‘నంద్యాల ఫలితం తర్వాత కూడా జగన్ ఎన్నికలంటూ ఊరేగుతున్నారు. పార్లమెంటు సమావేశాలు అయ్యాక ప్రత్యేక హోదా కోసం మీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలతో జూన్‌లో రాజీనామా చేయిస్తా అన్నారుగా.. ఆగస్టు వచ్చింది. మీ ఎంపీలతో రాజీనామా చేయించండి. విశ్వసనీయతకు మారు పేరు.. మాట తప్పను.. మడమ తిప్పను అంటారుగా.. మాటపై నిలబడండి' అని సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్ విసిరారు.

నేనే పిలుపునిచ్చా..
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్న జగన్ సవాల్‌పై సీఎం పైవిధంగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధి కోసం పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని, తటస్థులు కూడా పార్టీలోకి రావాలని తాను బహిరంగంగానే పిలుపు ఇచ్చానని గుర్తు చేశారు. ఎన్నికల కోసం ఉబలాటపడుతున్న జగన్ ఎంపీలతో రాజీనామా చేయించాలని, దానికి తనకేం అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పారు.

ఏంటీ ఉన్మాదం..
‘నంద్యాల ఫలితంతో రాష్ట్రం ఊపిరిపీల్చుకుంది. ఏంటీ ఉన్మాదం, ఏంటీ అరాచకత్వం అని ప్రతిపక్ష నేత తీరుపై ఆందోళన చెందిన రాష్ట్ర ప్రజలంతా ఉపశమనం పొందారు' అని వ్యాఖ్యానించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోను విజయం తమదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

రెచ్చగొడుతున్నారు..
‘నంద్యాల ఉప ఎన్నికలకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పనిలేదు. కానీ ప్రతిపక్ష నేత 13 రోజులు అక్కడే ఉండి ఏదో సాధించేస్తాం, తిరగరాసేస్తాం, నడిరోడ్డుపై కాల్చేస్తాం, బట్టలిప్పేస్తాం అంటూ మాట్లాడి నంద్యాల ఉప ఎన్నికకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు' అని సీఎం చంద్రబాబు ఎద్దేశా చేశారు. అభివృద్ధి, సంక్షేమం అజెండాతో తాము ప్రజల వద్దకు వెళితే జగన్ మాత్రం విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల ముందుకెళ్లాడని అన్నారు. ప్రజలు విజ్ఞత ప్రదర్శించి టీడీపీని గెలిపించారని చంద్రబాబు తెలిపారు.

జగన్ ఎప్పుడు మంచి బాష మాట్లతాడారని..
‘నంద్యాలలో ఓటమి తర్వాత కూడా జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడైనా మంచి భాష మాట్లాడారా? నేను, రాష్ట్ర ప్రజలే ఆయన మాటలను భరించే శక్తిని పెంచుకోవాలి. అతన్ని వాళ్ల నాన్నే భరించలేకపోయాడు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, సానుభూతి కూడా పనిచేసిందని అన్నారు. కులమతప్రాంతాలకు అతీతంగా నంద్యాల ప్రజలు టీడీపీని ఆదరించారని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు. 2019 ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయని స్పష్టం చేశారు.

అక్కడ డేరా బాబా... ఇక్కడ జగన్ బాబా
ఒక సాధువుగా ఉండి ఉన్మాదాన్ని ప్రోత్సహించేందుకు డేరా బాబా ప్రణాళిక వేశారని, రాజకీయాల్లో జగన్ బాబా.. హింస, ఉన్మాదం, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ‘జనవరి 26న దేశమంతా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటుంటే జగన్ జల్లికట్టు స్ఫూర్తితో ఉద్యమం అంటాడు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నది ఆయన కుట్ర. విశాఖ విమానాశ్రయంలో పోలీసులు ఆపితే...ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు తెలుసా?.. రిటైరయ్యాక నీ పింఛను కట్ చేస్తా అని హెచ్చరిస్తాడు' అని జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండేళ్ల కోసం ఇంత అవసరమా?
‘నేను ఒక సంప్రదాయానికి శ్రీకారం చుట్టా. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరణిస్తే, వారి కుటుంసభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే మంచి సంప్రదాయం అది. కానీ, భూమా నాగిరెడ్డి చనిపోతే ప్రతిపక్ష నేత జగన్ ఆ సాంప్రదాయం పాటించలేదని తెలిపారు. నంద్యాలలో ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి సమయం రెండేళ్లే ఉంటుందని, దానికి ఇంత రాజకీయం అవసరమా? అని సీఎం ప్రశ్నించారు.

ముందే ఊహించా.. జగన్ 13రోజులు పర్యటించినా...
‘ఇది చారిత్రాత్మక విజయం. ఈ గెలుపును ముందే ఊహించాను. విజయం సాధిస్తామని గట్టి నమ్మకంతో ఉన్నా. నేను ఎన్నికలను మొదటిసారి ఎదుర్కోలేదు. కొత్తగా వచ్చినవాళ్లు అర్థం కాకుండా అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, ఏమి వెతుక్కోవాలో తెలియకుండా తత్తరపడ్డారు. ఏపికి న్యాయం చేస్తామన్న నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో టిడిపిని ప్రజలు గెలిపించారు. అవకాశవాద రాజకీయాలతో విశ్వసనీయత రాదు. మన నడవడికను బట్టే వస్తుంది. శోభానాగిరెడ్డి చనిపోతే మేం అభ్యర్థిని నిలబెట్టలేదు. అభివృద్ధి, సంక్షేమానికి నంద్యాల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మా పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అపూర్వ విజయం పట్ల ఆనందంగా ఉంది. ఈ విజయం అభివృద్ధికి నిదర్శనం. నంద్యాలలో జగన్ 13 రోజులపాటు బసచేసి ప్రలోభాలకు పాల్పడినా, ప్రజలు తిరస్కరించారు' అని చంద్రబాబు అన్నారు.

రాబోయే ఎన్నికలకు నిదర్శనం.. పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారు..
‘నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తాం. పట్టణంలోనే కాదు, గ్రామీణ ప్రాంతంలో కూడా టిడిపికి మెజార్టీ వచ్చిందంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతే కారణం. జనసేన పార్టీ అధ్యక్షుడు వపన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకుంది. దానిపై స్పందించను. ఉద్దానం సమస్యను నా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించా' అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోనూ వివిధ ఎన్నికలు ఒకేసారి జరగాలని భావిస్తున్నామని, అంతే తప్ప మేం ఎన్నికలకు వ్యతిరేకం కాదని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వం అభివృద్ధిని కోరుకుంటుంటే ప్రతిపక్షం ఎన్నికలను కోరుకుంటోందని ధ్వజమెత్తారు.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications