ఇల్లు మారనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త ఇంటికి మారబోతున్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఆయన ఇళ్లు ఇరుకుగా ఉందని, చంద్ర బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలు, సందర్శకుల తాకిడి పెరిగింది.
దీంతో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేసి, ఆ స్దానంలో కొత్త భవన నిర్మాణాన్ని డిసెంబర్‌లో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆదివారం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ బాబు సందర్శించనున్నారు.

ఒకవేళ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ నచ్చని పక్షంలో మదినాగూడలోని ఫాం హౌస్‌నే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చంద్రబాబు కుటుంబానికి సొంత ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications