మన్మోహన్ సింగ్‌లో నాయకత్వ లక్షణాలు లేవా?: బాబు ఏమన్నారంటే!
పదేళ్లు ప్రధానిగా పనిచేసినా.. నాయకుడిగా మాత్రం మన్మోహన్ సింగ్ ముద్ర వేయలేకపోయారని చంద్రబాబు టీడీపీ నేతలతో చెప్పారట.
విజయవాడ: 'మన్మోహన్ సింగ్'.. పదేళ్లపాటు ప్రధానిగా పనిచేసినా.. ఆయన నిర్ణయాధికారాలను పూర్తిగా నియంత్రించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఎప్పుడూ నిలవని మన్మోహన్ సింగ్.. నాయకుడిగా కన్నా ఓ ఆర్థికవేత్తగా ప్రపంచ దేశాల మన్ననలు పొందారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ లో నాయకత్వ లక్షణాలు లేవని తేల్చేసిన ఆయన.. సూటు, బూటు వేసుకుని గ్రామాల్లోకి వెళ్తే.. ప్రజలకు దగ్గర కాలేరని వ్యాఖ్యానించారు. పదేళ్లు ప్రధానిగా పనిచేసినా.. నాయకుడిగా మాత్రం మన్మోహన్ సింగ్ ముద్ర వేయలేకపోయారని చంద్రబాబు టీడీపీ నేతలతో చెప్పారట.

మంగళవారం నాడు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ ముఖ్యనేతలకు నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. సమావేశంలో సుదీర్ఘ ప్రసంగం ఇచ్చిన చంద్రబాబు.. నేతలకు నాయకత్వ లక్షణాలపై ప్రత్యేకంగా వివరించినట్టు సమాచారం. ఆ క్రమంలోనే మన్మోహన్ సింగ్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని చంద్రబాబు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications