బాబు ట్రంప్‌కు ఎక్కుపెడితే.. బాణం పవన్ కు తగిలింది..
విజయవాడ : నిజానికి ఈ వ్యాఖ్యలు చేసేప్పుడు చంద్రబాబు మదిలో పవన్ గురించిన ఆలోచన ఉండకపోవచ్చునేమో! అయితే విచిత్రంగా.. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పవన్ కు సూటిగానే తగిలాయి. ట్రంప్ ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఒకింత ఇబ్బంది పెట్టేవిగానే మారాయి.
ఇంతకీ విషయమేంటంటే.. ట్రంప్ గురించి మాట్లాడుతూ.. 'నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో భారత్ ను మించిన దేశం లేదు.. అమెరికాలో ఒక్కొక్కరు ఎన్నేసి పెళ్లిళ్లు చేసుకుంటారో చూస్తూనే ఉన్నాం.. ట్రంప్ కు ఇప్పుడున్నావిడ నాలుగో పెళ్లాం అయి ఉండొచ్చు. ' ఇదే తరహాలో కాస్త అటు ఇటుగా మొన్నీమధ్యే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇవే మాటలు ప్రస్తుతం పవన్ కు ఆపాదిస్తూ.. చంద్రబాబు పవన్ సంగతి మరిచిపోయి ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవన్ ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. అయితే భారత్ లాంటి నైతిక విలువలు పాటించే దేశంలో 'ఒక వ్యక్తికి ఒకే పెళ్లి' అన్న కట్టుబాటు గురించి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పరోక్షంగా పవన్ ను కార్నర్ చేసినట్లయింది.












Click it and Unblock the Notifications