ఏమ్మా.. మీ ఆయన తాగుతాడా? పెద్ద మనిషేనా? : చంద్రబాబు సరదా ముచ్చట

విశాఖపట్నం: జేఎన్ఎన్‌యూఆర్ఎం గృహ సమూదాయాల ప్రారంభోత్సవం సందర్భంగా.. స్థానిక మహిళలతో సరదాగా ముచ్చటించారు ఏపీ సీఎం చంద్రబాబు. కొంతమంది ఆడపడుచులను తమ బాగోగుల గురించి ఆరా తీసిన చంద్రబాబు.. సరదా వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూయించారు.

ఈ క్రమంలో.. ఓ ఆడపడుచును, ఆమె భర్తను వేదిక మీదకు పిలిచి.. ప్రభుత్వం మంజూరు చేస్తోన్న ఇళ్లు ఎలా ఉన్నాయంటూ? ఆరా తీసిన చంద్రబాబు.. మధ్యలో ఆమె భర్త గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. 'ఏంటమ్మా మీ ఆయన మందు తాగరా..! పెద్దమనిషేనా..? బుద్ధిగా ఉంటాడా..! మంచిగా చూసుకుంటాడా.. మీకుటుంబంలో వారంతా గొడవలు పడకుండా ఉంటారా?' అని ప్రశ్నించారు చంద్రబాబు.

దీనికి బదులిస్తూ.. 'మా ఇంటాయన తాగడు సార్..' అని ఆ ఆఢపడుచు సమాధానం ఇవ్వగ్గా.. 'ఏంటమ్మా నిజమేనా.. నమ్మకమేనా?' అంటూ నవ్వుతూ చంద్రబాబు మరోసారి అడిగారు. 'నిజం చెప్పమ్మా పర్లేదు.. ఇంటికెళ్లాక మీ ఆయన నీతో గొడవపడుతాడని అబద్దం చెప్పకమ్మా..' అంటూ మళ్లీ అడిగారు. ఇదే విషయమై అక్కడకు వచ్చిన గ్రామస్తులను కూడా ప్రశ్నించారు చంద్రబాబు.

 Chandrababu naidu conversation with a woman

'ఈయన పెద్దమనిషేనా , మందు తాగడా.. బుద్ధిగా ఉండే వ్యక్తేనా.. మీరే చెప్పడంటూ' గ్రామస్తులను అడిగారు. అందరినుంచి ఒకటే సమాధానం 'ఆయన తాగడు సార్' అని. ఇలా సరదా వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూయించారు చంద్రబాబు.

అనంతరం ఇళ్ల గురించి ఆరా తీస్తూ.. ఎలా ఉన్నాయమ్మా ఇళ్లు అంటూ ఆ ఆడపడుచును అడిగారు చంద్రబాబు. ఇళ్లు బాగున్నాయ్ సార్.. అంటూ సమాధానం చెప్పిన ఆమె టీడీపీ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. తామంతా దోబి పనిచేస్తామని, టీడీపీ పాలనలో తమకు బాగానే పని దొరుకుతందని వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+