రాజధాని: ఎన్టీఆర్ పేరుపై డైలమా, తాత్కాలికంగా..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఎక్కడ నిర్మించినా దానిని అత్యంత సుందరమైన కొత్త నగరంగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, మంత్రులకు వివరించారు. రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టమని పార్టీకి చెందిన నేతలతో పాటు ప్రజల నుండి, వివిధ సంస్థల నుండి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయని, అయితే ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని చంద్రబాబు వారితో చెప్పారని సమాచారం.

శాసనసభ సమావేశాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా పలువురు మంత్రులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు. అత్యంత కీలకమైన బిల్లును ఆమోదించడంతో పాటు రాజధానికి సంబంధించి కీలక ప్రకటన, రాష్ట్ర అభివృద్ధిపై స్పస్టమైన స్వరూపం ఇవ్వడం, బిసిలకు 33.3 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును ఆమోదించడం వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నందుకు పార్టీ నేతలు ఆయనను అభినందించారు.

Chandrababu Naidu discussed about capital

రాష్ట్ర అభివృద్ధికి ఉన్న బహుళ అవకాశాలను, అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు సమతుల్యమైన అభివృద్ధిని అన్ని జిల్లాల్లో సాధించాల్సిన ఆవశ్యకతను గుర్తించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధిని అన్ని జిల్లాలకు వికేంద్రీకరించడం కోసం మూడు మెగాసిటీలను, పద్నాలుగు స్మార్టు సిటీలను నిర్మిస్తామని, రాజధానిని ప్రస్తుత నగరంలో కాకుండా భూ సమీకరణ ద్వారా నిర్మిస్తామన్నారు.

అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రగతి సాధనకు, ప్రజల సమగ్ర సంక్షేమానికి సేవలు అందించగలదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకూ కొత్త రాజధాని సమదూరంలో ఉండాలనేదే తమ ఉద్ధేశ్యమని , అభివృద్ధిని వికేంద్రీకరించి, జిల్లాలను ప్రగతి పథంలో పయనింపచేయడం ప్రస్తుత విపత్కర తరుణంలో రాష్ట్రప్రభుత్వ భుజస్కందాలపై ఉన్న అత్యంత గురుతరమైన బాధ్యత అన్నారు.

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ ఇప్పటికే ఉన్న ప్రధాన రహదారులను అనుసంథానం చేస్తూ రోడ్డు, రైలు రవాణా మార్గాలను మరికొన్ని చోట్ల అభివృద్ధి పరుస్తామని , కర్నూలు అనంతపురం రహదారులను గుంటూరుతో కలుపుతూ ఒక మార్గం, నూతన రాజధానితో అనంతపురం కలుపుతూ కర్నూలు - గిద్దలూరు - వినుకొండ ద్వారా మరో మార్గాన్ని రాయలసీమ ప్రాంతాన్ని కృష్ణపట్నం పోర్టుకు కలుపుతూ మరో రహదారిని నిర్మిస్తామన్నారు. ప్రస్తుతానికి కొత్తగా నిర్మించే రాజధానిని ప్రజారాజధానిగా వ్యవహరించనున్నట్టు చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+