ఏపీ భవన్ ఇష్యూ: కేసీఆర్ తీరుపై ఘాటు వ్యాఖ్య చేసిన చంద్రబాబు
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించేందుకు స్వయంగా చంద్రబాబే మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ భవన్ స్థలంపై కన్నేసిన కేసీఆర్: హోంమంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ
ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌కు లేఖ రాయడాన్ని మీడియా ప్రతినిధులు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.

ఏపీకి సహకరించాల్సింది పోయి అన్నింటిలోనూ ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ''మనకన్నీ ఇబ్బందులే. ఓ పక్క ఆయన (కేసీఆర్) ఇబ్బంది పెడతాడు. కేంద్రం నుంచి ఇంకా నిధులు రాలేదు. అయినప్పటికీ మనం ముందుకెళ్లాలి. తెలివే మన ధైర్యం. దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉంది. 4 శాతం జనాభా ఉన్న ఏపీ... జేఈఈలో 15 ర్యాంకులు దక్కించుకోవడం మన సత్తాకు నిదర్శనం'' అని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పూర్వపు హైదరాబాద్ స్థలం మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ స్థలంలోనే ప్రస్థుత హైదరాబాద్ హౌస్, తెలంగాణభవన్‌లు ఉన్నాయన్నారు. తిరిగి ఆ స్థలంలో తెలంగాణ వాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!!












Click it and Unblock the Notifications