చంద్రబాబు ఖుషీ: నారా ఫ్యామిలీకీ సినీ ఫ్యాన్స్

విజయవాడ: నారా వారి కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్ తెలుగు సినిమాల్లో మాస్ హీరోగా ముందుకు రావడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని సంతోషపెట్టినట్లే ఉంది. రాజా చేయి వేస్తే... సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన చెప్పిన మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తోంది.

నందమూరి సినీ గ్లామర్‌తో నెట్టుకుని వస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు సొంత కుటుంబం నుంచి నారా రోహిత్ మాస్ హీరోగా ఎదగడంతో ఖాళీ భర్తీ అవుతుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. పైగా, ఈ సినిమాలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన తారకరత్న విలన్‌గా చేస్తున్నాడు.

ఇంతకు ముందు నందమూరి వంశానికి ఫాలోయర్స్ ఉండేవారు, ఇప్పుడు తమకు కూడా ఫాలోయర్స్ ఏర్పడ్డారని చంద్రబాబు ఆనందపడ్డారు. టిడిపికి, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉందని, ఈ సినిమాలో నారా - నందమూరి వంశాలవారు కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

Chandrababu Naidu happy with Nara Rohith

నారా రోహిత్ చంద్రబాబు సోదరుడి కుమారుడు. ఆయన సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను కూడా తన సినిమాల ద్వారా తయారు చేసుకున్నాడు. దాంతో చంద్రబాబు నారా రోహిత్‌ను తనతో కలిపేసుకున్నారని చెప్పవచ్చు.

నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ చంద్రబాబుకు దూరమయ్యారు. తన కుమారుడు నారా లోకేష్‌కు మామ కావడంతో బాలకృష్ణ మాత్రం చంద్రబాబు వెంట ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ లేని లోటును నారా రోహిత్ తీరుస్తాడా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఏమైనా, చంద్రబాబుకు వచ్చే ఎన్నికలనాటికి నారా రోహిత్ మరింత మాస్ హీరోగా ఎదిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+