'సిటీ ఆఫ్ ఎక్సలెన్స్' గా తిరుపతి: పేదవాడికి పప్పన్నం పెట్టాలనే చంద్రన్న కానుక
అమరావతి: తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం తిరుపతిలోని హోటల్ మానస సరోవర్‌లో ఫుడ్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పేదవాడికి పప్పన్నం పెట్టాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం చంద్రన్న కానుక ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో హోటల్స్ రంగం అభివృద్ధి చెందాలని చెప్పిన ఆయన వచ్చే సంక్రాంతికి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

బెంగుళూరు, చెన్నైలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తిరుపతి నగరంలోని అన్ని చెరువులను సుందరీకరణ చేసి సిటీ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారుస్తామని ఆయన చెప్పారు. వారసత్వంగా వస్తున్న వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వివరించారు.
ఇంటికొక కూచిపూడి కళాకారుడుండాలని ఆయన కోరారు. ఏపీలోని అన్ని గ్రామాలను ఆకర్షణీయంగా తయారు చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ. 5 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు కుదిరాయని ఆయన గుర్తుచేశారు.
హస్తకళల అభివృద్ధికి రూ. 17 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు గురువారం రాత్రికి నారావారిపల్లె చేరుకొనున్నారు.
శుక్ర, శనివారాల్లో నారావారిపల్లెలోనే నిర్వహించనున్న చంద్రబాబు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పోలీసులను భారీగా మోహరించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications