బాబువన్నీ శాడిస్టు విధానాలే: అంబటి, జగన్‌కు లక్షణాలు లేవు: సోమిరెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాటించేవన్నీ శాడిస్టు విధానాలేనని, అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీ రాజధాని విషయంలో రైతుల కోరిక మేరకే అసెంబ్లీలో వైయస్ జగన్ మాట్లాడారని, ఆయనంటే మీకెందుకు అంత భయమని ప్రశ్నించారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఈ ప్రభుత్వం కూలిపోవాలని రైతులు కోరుకుంటే తప్పేంటని అన్నారు. రైతుల హక్కులను హరిస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, పోలీసులకు, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరు బేష్ అంటూ లోకేష్ ఓ సర్వే చేయించారని... ఇదే సర్వేని రాజధాని తుళ్లూరులో చేయిస్తే ప్రభుత్వానికి ఒక్క మార్కు కూడా రాదని చెప్పారు.

Chandrababu Naidu is implementing sadistic procedures says Ambati

చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా: మాజీ మంత్రి

ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్ ఫోబియా పట్టుకుందని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. ఏపీ రాజధానిపై జనచైతన్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజధాని ఏర్పాటుపై ప్రత్యామ్నాయ మార్గాలను పక్కన పెడుతున్నారని అన్నారు. నూజివీడులో 12 వేల ఎకరాల దేవాదయ శాఖ భూమి ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు.

ప్రస్తుతం రాజధానిగా ఎంపిక చేసిన తుళ్లూరు ప్రాంతం జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం వచ్చే హెచ్చరికలున్నాయని చెప్పారు. తులసిరెడ్డి, జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి, వి. లక్ష్మణ్ రెడ్డి తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

వైయస్ జగన్‌కు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవు: సోమిరెడ్డి

ఓ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు వైయస్ జగన్‌కు లేవని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు అవగాహనే లేదన్నారు.

ప్రజల ఆదరణ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రెండేళ్ల కంటే అధికారంలో ఉండరని వైయస్ జగన్ జ్యోతిష్యం చెబుతున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+