ఇసుక ఎత్తుకుని మీ ఇంట్లో ఇస్తామని మేము చెప్పామా.. లేదే: చంద్రబాబు

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఉచితం- అని ఒక్క పక్క అంటూనే.. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కంటే మూడింతలు అధికంగా డబ్బులను వసూలు చేస్తోండటం కాకరేపుతోంది.

ఇసుక డిపోల వద్ద బ్యానర్లు కట్టి మరీ టన్నుకు 1,200 నుంచి 1,400 రూపాయల వరకు వసూలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఒకే బ్యానర్‌లో నూతన ఉచిత ఇసుక విధానము అంటూ తాటికాయంత అక్షరాలు రాసి వాటి కింద ఒక టన్ను ఇసుకకు ఎంత మొత్తాన్ని వసూలు చేస్తోన్నామనేది అనేది స్పష్టంగా పొందుపరిచారు.

Chandrababu Naidu lashes out at the YSRCP on Free Sand supply

దీనికి రవాణా ఛార్జీలు అదనం. లోడింగ్ ఛార్జీలను సైతం కొనుగోలుదారుల మీదే మోపింది కూటమి సర్కార్. ఆధార్ కార్డును చూపించి, డబ్బులు చెల్లించిన వారికి రోజుకు 20 టన్నుల మేర ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం జీఓ సైతం విడుదల చేసింది.

ఈ ఉచిత ఇసుక విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారంటూ మండిపడుతోంది. ప్రజలను నమ్మించి మరీ మోసం చేసిందంటూ ధ్వజమెత్తుతోంది.

అటు సోషల్ మీడియాలో సెటైర్లపై సెటైర్లు పేలుతున్నాయి. ఒకవంక ఉచితం అంటూనే మరోవంక- గరిష్ఠంగా 1,400 రూపాయల వరకు డబ్బులను వసూలు చేస్తోండటం కూటమి సర్కార్‌ను నవ్వులపాలు చేస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇలాగే ఉంటాయంటూ జోస్యం చెబుతున్నారు.

ఈ విమర్శలపై చంద్రబాబు స్పందించారు. ఉచిత ఇసుక విధానంపై విమర్శలు చెలరేగుతున్న విషయం.. విద్యుత్ మంత్రిత్వ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తోన్న సందర్భంగా చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీపై ఎదురుదాడికి దిగారు.

ఉచిత ఇసుక. చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాం అన్నాం. ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే, ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేమేమైనా ఇసుక ఎత్తుకుపోయి వాళ్లింట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడుతున్నారు. లేదంటే నేనే మళ్లీ నిలబడి ఇల్లు కూడా కట్టిస్తానని, వాళ్ల ఇంట్లో, పొలాల్లో నేను పని చేస్తానని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్లని. ఇది రాజకీయం.. అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+