చంద్రబాబు క్యాంప్ 'నాగార్జునే'! జూన్2వారంలో ప్రమాణం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తాత్కాలిక క్యాంప్ కార్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణమేనని ఖరారైందని సమాచారం. నాగార్జునలో బాబుకు, ఆరో బెటాలియన్‌లో డిజిపి, ఇతర ఉన్నతాధికారులకు తాత్కాలిక క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా పోలీస్ ఉన్నతాధికారులకు సంకేతాలు వెలువడ్డాయి.
నాగార్జునలో భవనాలకు భద్రత కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం. భద్రతా ఏర్పాట్లకుగాను ఐదు సీఆర్‌పీఎఫ్ కంపెనీల బలగాలను కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న మరో రెండు సీఆర్‌పీఎఫ్ కంపెనీల బలగాలను కూడా భద్రతా ఏర్పాట్లకు అనుమతించాలని ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు అప్రమత్తమై ఏర్పాట్లను చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు.

సిఎం తాత్కాలిక క్యాంప్ కార్యాలయానికి సంబంధించి ఇప్పటి వరకు కేటాయించిన ఏడు కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు అర్బన్, రూరల్ జిల్లాలకు సంబంధించి సుమారు మూడు వేల మంది పోలీస్ సిబ్బందిని కేటాయించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. క్యాంప్ కార్యాయాలు ఏర్పాటైన తర్వాత అంతర్గత భద్రతకు ఏపీఎస్పీ బలగాలతో పాటు మరికొందరు స్పెషల్ పోలీసులను నియమించనున్నారు.
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జూన్ రెండో వారంలో చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో సుమారు 3 వారాల గడువు ఉన్నందున హైదరాబాద్‌లోని ఉన్నత స్థాయి అధికారులు కూడా హడావుడి లేకుండా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టాక తన క్యాంపు కార్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయంలో అని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండటంతో అప్పటిదాకా ఆగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారట.












Click it and Unblock the Notifications