రెచ్చిపోతున్న సోము వీర్రాజు: రంగంలోకి చంద్రబాబు, ఎవరేమన్నారని ఆరా
Recommended Video

అమరావతి: బడ్జెట్ నేపథ్యంలో బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరువర్గాలు సై అంటే సై అంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీపై వీర్రాజు నిప్పులు చెరుగుతుంటే, అందుకు టీడీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.
వ్యవహారం ముదిరే పరిస్థితులు కనిపిస్తుండటంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. వీర్రాజు వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దని ఆయన నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత విమర్శలపై సంయమనం పాటించాలని సూచించారు. ఆయనను పట్టించుకోవద్దన్నారు.

ఖండించాల్సిన అవసరం లేదు
సోము వీర్రాజు మనపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం లేదని టీడీపీ అధిష్టానం నేతలకు ఆదేశాలు జారీ చేసింది. వీర్రాజు ఏం మాట్లాడినా మౌనం వహించాలని, అతిగా స్పందించవద్దని సూచించింది. దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హితవు పలికింది.

మెట్టు దిగిన చంద్రబాబు
బడ్జెట్‌పై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆదివారం వరకు చెప్పారు. ఢిల్లీ పెద్దలు సముదాయించడంతో ఓ మెట్టు దిగారు. అయితే, టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలపై సోము వీర్రాజు ధీటుగా స్పందించారు.

రంగంలోకి తమ్ముళ్లు
దీంతో తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్దా వెంకన్న, జీవీ ఆంజనేయులు, మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు తదితరులు సోము వీర్రాజుపై నిప్పులు చెరిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన చంద్రబాబు రంగంలోకి దిగారు.

వీర్రాజు ఇంటి ముందు ఆందోళన
అంతేకాదు, సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వీర్రాజు ఉంటిని చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో సోము వీర్రాజు మళ్లీ అదేస్థాయిలో టీడీపీపై ఫైర్ అయ్యారు.

చంద్రబాబు ఆరా
వాగ్యుద్ధం పెరుగుతుండటంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. వీర్రాజుపై పార్టీకి చెందిన నేతలు చేసిన కామెంట్లపై చంద్రబాబు ఆరా తీశారు. ఇక నుంచి ఆయన విమర్శల పట్ల మౌనంగా ఉండాలని చెప్పారు. జిల్లా అధ్యక్షులకు ఈ మేరకు ఆధేశాలు జారీ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications