శాఖలకు రేటింగ్స్: చంద్రబాబుకు జీరో, కామినేని, నారాయణలకు త్రీ స్టార్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించినందుకు రాష్ట్రంలో వివిధ శాఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేటింగ్స్ ఇచ్చారు. ఈ రేటింగ్స్‌లో టూరిజం శాఖకు జీరో రేటింగ్ రావడం విశేషం. ఇంతకీ ఈ టూరిజం శాఖను స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో టూరిజం శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోక పోవడంతో చంద్రబాబు తనకు తానే జీరో రేటింగ్ ఇచ్చుకున్నారు. ఏపీలోని వివిధ శాఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన రేటింగ్స్ ఇలా ఉన్నాయి. ఏపీలో ముఖ్యమైన శాఖలుగా పేరుగాంచిన విద్యాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల పనితీరుపై చంద్రబాబు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు.

విద్యాశాఖను మంత్రి గంటా నిర్వహిస్తుండగా, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ శాఖను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు శాఖలు కూడా జీరో రేటింగ్ సొంతం చేసుకున్నాయి. మొత్తం తొమ్మిది శాఖలకు సీఎం చంద్రబాబు త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చారు.

Chandrababu Naidu rates AP wings, gives himself a zero

కామినేని శ్రీనివాస్ పర్యవేక్షణలోని ఆరోగ్య శాఖ, కె. నారాయణ పర్యవేక్షణలోని మున్సిపల్ శాఖ, చంద్రబాబు పర్యవేక్షణలోని ఎనర్జీ శాఖలు త్రీ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుని అత్యుత్తమ పనితీరుని కనబర్చిన వాటిలో శాఖల్లో ఉన్నాయి. హోం శాఖలో భాగమైన పోలీసు శాఖ, దేవినేని ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలోని నీటి పారుదల శాఖలు టు స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి.

ఇక యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని ఆర్ధిక శాఖ, రెవెన్యూ శాఖలు ఒక స్టార్‌ను సొంతం చేసుకున్నాయి. కాగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలోని స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ 73.21 శాతం వృద్ధి సాధించి, ప్రభుత్వానికి రూ. 700కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

ఈ విభాగంలో విశాఖపట్నం నుంచి అత్యధికంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇక అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగిన జిల్లాగా గుంటూరు జిల్లా రికార్డు సాధించింది. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా కమర్షియల్ డిపార్ట్‌మెంట్‌కు ఈ ఏడాది రూ. 2,667 కోట్ల మేరకు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+