విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ గవర్నెన్స్: చంద్రబాబుకు ‘బెస్ట్ సీఎం అవార్డు’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

పుణె: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉత్తమ ముఖ్యమంత్రి పురస్కారంతో పుణెలోని భారతీయ ఛాత్ర సంసద్ సంస్థ శనివారం సత్కరించింది. భారతీయ ఛాత్ర సంసద్ ఆరో మహాసభలో చంద్రబాబు ఉత్తమ ముఖ్యమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు అందుకునేందుకు ఆయనను వేదిక మీదకు ఆహ్వానిస్తూ గుడ్ గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచారంటూ నిర్వాహకులు అభినందించారు.

ప్రజాజీవితంలో యువతకు ఆదర్శంగా నిలుస్తూ, రాష్ట్ర విభజన జరిగిన క్లిష్ట సమయంలో నూతన రాష్ట్ర ఆవిష్కరణ , అభివృద్ధిని సమర్ధవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డును అందజేస్తున్నామని అన్నారు. చంద్రబాబు తన ప్రసంగిస్తూ.. భారతీయ ఛాత్ర సంసద్ యువతకు రాజకీయ విలువలను నేర్పించడంలో చేస్తున్న కృషిని కొనియాడారు.

యువశక్తి, విశాలమైన మార్కెట్, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టబద్ధ పరిపాలన, అపారమైన ప్రకృతి వనరులు ఉన్న భారతదేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఆయన అన్నారు. యువత దేశాభివృద్ధిలో ప్రధానపాత్ర వహించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోవడంలో క్రియాశీలంగా పాల్గొనాలని కోరారు.

‘బెస్ట్ సీఎం అవార్డు'

‘బెస్ట్ సీఎం అవార్డు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉత్తమ ముఖ్యమంత్రి పురస్కారంతో పుణెలోని భారతీయ ఛాత్ర సంసద్ సంస్థ శనివారం సత్కరించింది. భారతీయ ఛాత్ర సంసద్ ఆరో మహాసభలో చంద్రబాబు ఉత్తమ ముఖ్యమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు.

‘బెస్ట్ సీఎం అవార్డు'

‘బెస్ట్ సీఎం అవార్డు'

ఈ అవార్డు అందుకునేందుకు ఆయనను వేదిక మీదకు ఆహ్వానిస్తూ గుడ్ గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచారంటూ నిర్వాహకులు అభినందించారు.

‘బెస్ట్ సీఎం అవార్డు'

‘బెస్ట్ సీఎం అవార్డు'

చంద్రబాబు తన ప్రసంగిస్తూ.. భారతీయ ఛాత్ర సంసద్ యువతకు రాజకీయ విలువలను నేర్పించడంలో చేస్తున్న కృషిని కొనియాడారు.

ఆరోగ్యశాఖ మంత్రితో చంద్రబాబు

ఆరోగ్యశాఖ మంత్రితో చంద్రబాబు

ఇటీవల మోకీలు శస్త్ర చికిత్స చేయించుకున్న మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పరామర్శిస్తున్న సీఎ చంద్రబాబునాయుడు.

చంద్రబాబు రివ్యూ

చంద్రబాబు రివ్యూ

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో విశాఖ ఖ్యాతి పెరగాలని, ప్రపంచపటంలో విశాఖకు సుస్థిర స్థానం లభించేలా ఏర్పాట్లు చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఫిబ్రవరి 4నుంచి 8వరకూ విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్షించారు.

చంద్రబాబు రివ్యూ

చంద్రబాబు రివ్యూ

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు అనేకమంది వివిఐపిలు వస్తున్నందున భద్రత కట్టుదిట్టంగా ఉండాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భద్రతా చర్యల్లో ఉపయోగించాలని సూచించారు.

చంద్రబాబు రివ్యూ

చంద్రబాబు రివ్యూ

పాస్‌లు జారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐరిష్ టెక్నాలజీ ఉపయోగించి పాస్‌లు జారీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. వీటిని ముందుగానే ఊహించి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు రివ్యూ

చంద్రబాబు రివ్యూ

వివిధ దేశాల నుంచి విశాఖ వచ్చే అతిథులను విశాఖ అందాలు ఆకట్టుకునేలా చూడాలని చంద్రబాబు కోరారు. రాష్టప్రతి, ప్రధాన మంత్రి సహా వివిఐపిలు అంతా తిరిగి వెళ్లేంతవరకూ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

English summary
The Pune based organisation, Bharatiya Chatra Sansad, in partnership with MIT School of Governance, has honoured Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu with “Aadarsh Mukhyamantri Puraskar” (Model CM Award) in its 6th annual session on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X