కెవిపి మాటేంటి, కెసిఆర్‌కు వద్దు: బాబు, హరీష్ సవాల్

మహబూబ్ నగర్/మెదక్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి దమ్ముంటే కెవిపిని అరెస్టు చేయించాలని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. తెరాసకు ఓటేస్తే రావణాసుర రాజ్యమే అన్నారు. కెసిఆర్, జైపాల్ రెడ్డిలు వలస పక్షులు అన్నారు. దేశంలో మోడీ సునామీ ఖాయమన్నారు. తెరాసకు ఓటు వేస్తే దున్నపోతులకు వేసినట్లే అన్నారు. తాము వస్తే తెలంగాణలో కరెంటు కోతలు ఉండవన్నారు. టిడిపి రాముడు అయితే, కెసిఆర్ రావణాసురుడన్నారు.

కొడుక్కి, బిడ్డకు, మేనల్లుడికి టికెట్లు ఇచ్చారని, ఏం.. పేదలు లేరా? బిసిలు లేరా? వారికెందుకు టికెట్లు ఇవ్వలేదు? తెరాస మోసగాళ్ల పార్టీ అని దుయ్యబట్టారు. కెసిఆర్ మాయల ఫకీరు అని, ఆయనవన్నీ దుర్మార్గమైన ఆలోచనలన్నారు. ఆయనను గెలిపిస్తే గేటు వద్ద కుక్కలతో కరిపిస్తారని హెచ్చరించారు. తెలంగాణను దేవాలయంగా అభివర్ణించిన చంద్రబాబు.. ఆ దేవాలయంలో రాముడు ఉండాలన్నారు.

Chandrababu Naidu ridicules KCR farm claims

కెసిఆర్ వసూల్ రాజాగా మారి అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడని, కెసిఆర్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలి వెళ్లేపోయే ప్రమాదం ఉందన్నారు. ఎకరాకు కోటి రూపాయలు సంపాదించవచ్చని చెప్పిన కెసిఆర్‌కు అలంపూర్ ప్రాంతంలోని పేదల భూములన్నీ ఇప్పిస్తామని, ఎకరాకు రూ.20 వేలు ఇస్తే చాలని చెప్పారు. ఇందుకు పేదలు తమ భూములు ఇచ్చేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

కెసిఆర్‌కు చిత్తశుద్ధి లేదని అంటూనే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తమ హామీలను కెసిఆర్, రాహుల్, జగన్ కాపీ కొట్టి, వారి పథకాలుగా చెప్పుకొంటున్నారన్నారు. రైతు రుణ మాఫీని తాము ప్రకటిస్తే.. కెసిఆర్, మొద్దబ్బాయ్ రాహుల్ తమను అనుకరించారన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ టిడిపి అన్నారు. టిడిపి, బిజెపి కూటమిని గెలిపిస్తే పేదల కోసం నిరంతరం కృషి చేసిన ఆర్ కృష్ణయ్య సిఎం అవుతారన్నారు.

రాజకీయ సన్యాసం చేస్తా: హరీష్

తెలంగాణ రాష్ట్రంలో టిడిపి అసలు ఉండదని, మెదక్ జిల్లాలో టిడిపి అభ్యర్థుల్లో ఒక్కరికి డిపాజిట్ దక్కదని హరీష్ రావు వేరుగా అన్నారు. తెలంగాణలో నాలుగు సీట్లు కూడా ఆ పార్టీకి రావన్నారు. ఈ నెల 30న ఇక్కడ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఊసరవెల్లిలా చంద్రబాబు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది తానేనని, ఎన్డీయే హయాంలో రాకుండా చేసింది తానేనని, ఆంధ్రాలో టిడిపిని గెలిపిస్తే కోర్టుకు వెళ్లి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నిలుపుదల చేస్తానని చెబుతారని, అక్కడికి వెళ్లి బాబు అలా చెప్పకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+