వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సచివాలయానికి వాస్తు దోషం: రూట్ మార్చుకుంటున్న చంద్రబాబు

ఏపీ సచివాలయానికి వాస్తుదోష నివారణ ప్రక్రియ కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం బ్లాక్ ఎదురుగా అసెంబ్లీకి వెళ్లేందుకు కొత్తగా గేటు ఏర్పాటు చేస్తున్నారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సచివాలయానికి వాస్తుదోష నివారణ ప్రక్రియ కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం బ్లాక్ ఎదురుగా అసెంబ్లీకి వెళ్లేందుకు కొత్తగా గేటు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ గేటుకు సమాంతరంగా సీఎం బ్లాక్ వెనుక వైపు మరి గేటు ఏర్పాటు చేయబడుతుంది.
ఇప్పటికే అసెంబ్లీకి 5 గేట్లు వుండగా.. వాస్తు కారణంగా మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. సచివాలయం వాస్తు దోషాల కారణంగా రూటు మార్చుకుని వస్తున్నారు సీఎం చంద్రబాబు.

chandrababu naidu route change to secretariat

చిన్నారుల వైకల్యానికి చలించిన సీఎం: వెంటనే ఆర్ధిక సాయం

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామం నుంచి వచ్చిన ఓ కుటుంబం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. వైద్యచికిత్సకు కొద్దిపాటి ఆస్థిని కరిగించామని, అయినా తమ బిడ్డకు బాహ్య ప్రపంచం తెలియనివాడిగా మిగిలాడని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ బాధను చెప్పుకున్నారు. బాలుని పరిస్థితి చూసి చలించిన ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. ఆ డబ్బును నాగుల్ మీరా పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, నెలనెలా వచ్చే వడ్డీతో అతడి వైద్య ఖర్చులకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మాటలు రాని ఆ చిన్నారులకు సాయం

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు నుంచి వచ్చిన త్రివేణి (15), వెంకట్ (12) మూగపిల్లలు. తమ బాధను చెప్పుకోలేని నిస్సహాయులు. శస్త్ర చికిత్స చేస్తే మాటలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పిన మాటలు వారికి ఒయాసిస్సుల్లా అనిపించాయి. మాట వస్తుందన్న ఆశ ముందుకు నడిపిస్తుండగా శస్త్ర చికిత్సకు ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వారి శస్త్ర చికిత్సకు రూ. 10 లక్షల వ్యయం అవుతుందని వైద్యులు తేల్చారు.

శస్త్ర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలిద్దరి బాగోగులను చూసుకుంటామని హామీ ఇచ్చారు. పేదరికంలో ఉన్నామని, జరుగుబాటుకు పనిచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని, సాయపడాలని వచ్చిన పలువురికి ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయం అందజేశారు.

ఇది ఇలావుండగా, దేవాలయాలకు చెందిన ఇనాం భూముల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఇప్పటికే ఇనాం భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్న బాధితులతో కలిసి ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని పరిశీలించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

English summary
It is said that Andhra Pradesh CM Chandrababu Naidu changes his route to secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X