హైద్రాబాద్‌లో లేకుంటే..: బాబు, సభలో కెవిపి బ్యానర్, వారించిన కురియన్
రాజమండ్రి/ఢిల్లీ: తాను సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా అయిన ప్రారంభంలో హైదరాబాదుకు అంతర్జాతీయ విమానం లేదని, తాను సాధించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.
రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక అభివృద్ధి అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏపీలో వనరులకు కొదవు లేదన్నారు. సమస్యలను సవాలుగా తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు.
తాను హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో హైదరాబాదుకు ఒక్క అంతర్జాతీయ విమానం లేదని, డొమెస్టిక్ ఎయిర్ పోర్టు కూడా సరిగా లేదని చెప్పారు. ఆ తర్వాత తాను కొట్లాడి సాధించానని తెలిపారు. అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రోడ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు.
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పోర్టులు కావాలన్నారు. రాష్ట్రంలో 940 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఐదు క్లస్టర్లుగా అబివృద్ధి చేసి అన్ని రేవులను అనుసంధానం చేస్తామన్నారు. తూర్పు ఆసియా దేశాలకు ఏపి గేట్ వేగా తయారవుతుందన్నారు.

రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, సవాలుగా తీసుకుంటామన్నారు. గోదావరి పుష్కరాలకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఇప్పటికే మూడు కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం బ్యానర్లు
పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం బ్యానర్లు పట్టుకొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు జేడీ శీలం, కేవీపీ రామచంద్ర రావు సభలో బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ వారిని వారించారు.
-
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications