Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్‌పై అంత అవసరంలేదు: బాబు సీరియస్, అనంతపురం వరదలపై ఆశ్చర్యం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పైన ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పైన ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

మంగళవారం అమరావతిలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.

సర్వే నివేదికలు ఉన్నాయి

సర్వే నివేదికలు ఉన్నాయి

ప్రతి ఒక్కరి ప్రవర్తనపై సర్వే నివేదికలు తన వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తన నుంచి సమాచారం తీసుకొని పని చేయడం సరికాదని ఆయన నేతలకు హితబోధ చేశారు. మీ అంతట మీరే పని చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదించాలని చెప్పారు.

పవన్ కళ్యాణ్ విషయంలో అంత అవసరం లేదు

పవన్ కళ్యాణ్ విషయంలో అంత అవసరం లేదు

ఇటీవల పవన్ కళ్యాణ్‌ వ్యవహారంలో పలువురు నేతలు అసందర్భంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌పై మంత్రి పితాని ఎప్పుడూ మాట్లాడినట్లు మాట్లాడేశారని, అంత అవసరం లేదన్నారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

సానుకూలత పెరిగింది

సానుకూలత పెరిగింది

ఇంటింటికీ టిడిపిలో ప్రజాస్పందన బాగుందని, ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని చంద్రబాబు అన్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో 16 శాతం సానుకూలత పెరిగిందన్నారు.

రాజమౌళికి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు

రాజమౌళికి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు

దర్శకులు రాజమౌళికి సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ఫిల్మ మేకర్ దిగ్గజానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, మీరు ఇలాగే స్క్రీన్ పైన మ్యాజిక్ చేస్తూ ఉండాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అనంత వరదలపై చంద్రబాబు ఆశ్చర్యం

అనంత వరదలపై చంద్రబాబు ఆశ్చర్యం

ఇదే భేటీలో అనంతపురంలో వరదలపై చంద్రబాబు స్పందించారు. అనంతపురంలో వరదలు ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. రాయలసీమలో కరువు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే అన్ని ఏకపక్ష ఎన్నికలే అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+