ఉంగరం రహస్యం చెప్పిన చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎప్పుడూ చాలా సామాన్య జీవితాన్ని గడుపుతుంటారు. జేబులో ఒక పెన్ను మాత్రమే ఉంటుంది. వీలైతే చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. అంతకుమించి ఆడంబరాలంటూ ఏమీ ఉండవు. కానీ అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా ఎడమచేతి చూపుడువేలికి ఒక ఉంగరం ధరించి కనిపించారు. బాబు ఉంగరం ధరించడమనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇప్పుడు ఇదే వార్త హల్‌చల్ చేస్తుండటంతో దీనిపై చంద్రబాబునాయుడు స్పందించి ఎందుకు ఉంగరం ధరించారో వివరించారు.
జ్యోతిష్యుడెవరూ చెబితే తాను ఉంగరం ధరించలేదని, కేవలం ఆరోగ్యం కోసమే పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ ఉంగరంలో ఒక చిప్ ఉందని, అది ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని కనిపెట్టి వివరాలన్నింటినీ వైద్యులకు తెలియజేస్తుందన్నారు. అందుకోసమే ఉంగరం ధరించినట్లు బాబు వెల్లడించారు.

చంద్రబాబు ఉంగరం ధరించారని, జ్యోతిష్యులు చెప్పివుంటారని, మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ రకరకాల వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన ఇచ్చిన స్పష్టతతో ఇవన్నీ పటాపంచలయ్యాయి. బాదుడే బాదుడు, మహానాడు తర్వాత మినీ మహానాడుకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, వర్షాలవల్ల కార్యక్రమాలను వాయిదా వేస్తున్నామని, వీలు చూసుకొని ప్రతి జిల్లాకో మినీ మహానాడు జరుగుతుందని చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలకే ఒక ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉండటం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని, పరిపాలించడం రానివారు పదవికి రాజీనామా చేసి వెళ్లాలన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications