వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు నా మంచి ఫ్రెండ్: మోడీ, బెస్ట్ డాడీ: లోకేష్, వెంకయ్య ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు.

అంతకుముందు తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ట్విట్టర్‍లో శుభాకాంక్షల ట్వీట్ లో చంద్రబాబును మోడీ.. తన స్నేహితుడిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పని చేసుకుని పోతున్నారని కితాబిచ్చారు. చంద్రబాబుకు దీర్ఘాయుష్సును ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు మోడీ పేర్కొన్నారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి చంద్రబాబు తన జీవితంలో తనకు ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చారని ట్విట్టర్లో పేర్కొన్నారు. నేర్చుకోవడంలో, విజయంలో తన తండ్రి తనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. మీరు నాకు మంచి మెంటర్ అన్నారు. అలాగే బెస్ట్ ఫాదర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు విజయవాడలో చంద్రబాబును కలిసి జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు. టిటిడి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టిటిడి వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదించారు.

నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబును మంచి స్నేహితుడిగా ప్రధాని పేర్కొన్నారు.

నారా లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తండ్రి తనకు జీవితంలో అన్నింటా మెంటర్‌గా ఉన్నారనిసామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు.

వెంకయ్య నాయుడు

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు విజన్ గల నేత అని, బాగా కష్టపడతారని, అతనికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు.

మనోహర్ లాల్ కట్టార్

కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టార్ ఏపీ సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అతను ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో, విజయాలతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

English summary
Chandrababu Naidu turns 66 today; wishes pour in for Andhra Pradesh CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X