తెరాస, వైసిపిపై టీజీ ఆగ్రహం: మోడీ! ఏదో చెప్పండి: బాబు అసంతృప్తి

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల అంశంపై మాజీ మంత్రి, టిడిపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస పైన మండిపడ్డారు. ఏపీ కోసం వైసిపి ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు.

బాబు ఆపరేషన్ రివర్స్, జగన్ చెప్పిందే నిజమా?: టిడిపికి ఆప్షన్ 'వైసీపీ'

రాష్ట్రానికి వచ్చే నిధులు అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి పోరాడాలన్నారు. ఏపీకి ఏది ఇస్తే మాకు అదే ఇవ్వాలని తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస చెప్పడం సరికాదన్నారు. తెలంగాణకు కావాల్సినవి కేంద్రాన్ని అడిగి తెచ్చుకోవచ్చునని చెప్పారు.

Chandrababu Naidu unhappy with Centre funds

ప్యాకేజీనా, హోదానా స్పష్టం చేయాలి: చంద్రబాబు

ఏపీ ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఏపీని కేంద్రం ఆదుకవాలని, ఏపీకి హోదా ఇస్తారా లేక ప్యాకేజీ ఇస్తారా స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన నిధులు నామమాత్రమే అన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామని, 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 53 శాతం, 58 శాతం జనాభా ఉన్న ఏపీకి 47 శాతం ఆదాయం ఇచ్చారన్నారు. ఏపీకి 16వేల కోట్ల ఆర్థిక లోటును కేంద్రం భర్తీ చేస్తుందని 14వ ఆర్థిక సంఘం హామీ ఇచ్చిందన్నారు. అచయితే ఇప్పటి వరకు కేవలం రూ.2,800 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+