వరంగల్‌లో ఏపీ సీఎం: బాబు ఎదుటే టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం 10.15గంటలకు వరంగల్‌ నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో జరుగుతున్న ములుగు మాజీ ఎమ్మెల్యే

వరంగల్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం 10.15గంటలకు వరంగల్‌ నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో జరుగుతున్న ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహానికి ఆయన హాజరయ్యారు.

వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్‌ వద్ద దిగిన ఆయన అక్కడ నుంచి వాహన శ్రేణిలో విష్ణుప్రియ గార్డెన్‌కు చేరుకున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

chandrababu naidu visits Warangal for marriage

సీఎం వెంట తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎల్‌ రమణ సహా పలువురు నేతలు ఉన్నారు. ఏపీ సీఎం పర్యటన సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ పొలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఏపీ సీఎం అయిన తర్వాత చంద్రబాబు జిల్లాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చంద్రబాబు ఎదుటు టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబునాయుడు ఎదుటే ఓ టీడీపీ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఆర్థిక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించిన అర్షం సవ్ామి అనే టీడీపీ నేతను పలువురు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడ్ని వారించి ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+