తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవాలి, పవన్ కళ్యాణ్ కూడా మద్దతిచ్చారు: చంద్రబాబు

Recommended Video

    Telangana Elections 2018: TRS ఓడిపోతేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది - చంద్రబాబు నాయుడు

    హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోతేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. తెలుగు జాతికి మేలు కలగాలంటే తెలంగాణలో మహాకూటమి (ప్రజా ఫ్రంట్) విజయం సాధించాలన్నారు.

    రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేసిన తనను కేసీఆర్ ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.

    Chandrababu Naidu wants TRS defeat in Telangana Assembly elections

    కేసీఆర్‌ తనను తిడుతున్నారని, ఎందుకు తిడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, తెలుగు జాతి కలిసి ఉండాలని నేను చెబుతున్నానని, విడిపోయినా కలిసి ఉందామని నేను చెబుతుంటే, మీరెవరు చెప్పడానికని కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి కోసం, దేశ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు.

    తెలంగాణ అభివృద్ధి చెందాలని, తెలంగాణకు మనం సహకరించాలని చెప్పారు. బీజేపీకి తెరాస పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కూడా తెలంగాణలో తెరాసకు మద్దతు ఇస్తారని, తెలంగాణ ప్రయోజనాల కోసం హైదరాబాద్‌లో ఉండే ప్రజల ప్రయోజనాల కోసం, ఆ రోజు ఏ అభివృద్ధి కోసమైతే నేను కష్టపడ్డానో అది జరగాలంటే తెరాస ఓడిపోవాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+