ఘనంగా లేపాక్షి ఉత్సవాలు: బాలకృష్ణ, నన్ను ఇంప్రెస్ చేసేందుకు కబుర్లొద్దు: బాబు
చిత్తూరు: లేపాక్షి నంది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం నాడు చెప్పారు. లేపాక్షి నంది ఉత్సవాల పైన బాలకృష్ణ మంత్రి మాణిక్యాల రావుతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27, 28 తేదీల్లో లేపాక్షి నంది ఉత్సవాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
లేపాక్షి ఉత్సవాల పైన ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ పాటకు రూపకల్పన చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. లేపాక్షి ఉత్సవాల నిర్వహణ పైన అధఇకారులతో తాము చర్చించామని చెప్పారు.

ఇంప్రెస్ చేయాలని చూడొద్దు: చంద్రబాబు
తనను ఇంప్రెస్ చేయాలని కబుర్లు చెప్పవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలను హెచ్చరించారు. ఆయన నేతల పని తీరు, నివేదికల పైన చర్చించారు. ఈ సందర్భంగా.. తనను ఇంప్రెస్ చేసేందుకు చూడవద్దని, పని చేయాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications