ప్రతిపక్ష నేత జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభ లోపలికి జగన్ రాగానే, ఆయన సీటు వద్దకు వెళ్లిన చంద్రబాబు ఆయనతో కరచాలనం చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
చంద్రబాబు వెంటే వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు కూడా వైయస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన వద్దకు వచ్చి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, ఇతరులతో జగన్ ఆత్మీయ కరచాలనం చేశారు.

కాగా అంతకు ముందు లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు నేతలు బర్త్ డే విషెష్ తెలిపారు. మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications