దేశం, ప్రపంచం ప్రేమించేలా: విశాఖపై కోహ్లీ ట్వీట్ మీద స్పందించిన చంద్రబాబు
అమరావతి/విశాఖపట్నం: విశాఖపట్నం అద్భుతంగా ఉందని, ఇక్కడకు రావడం ఎంతో ఇష్టమని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కోహ్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Glad that Visakhapatnam is emerging out to be the loved destination both nationally and globally. Wishing @imVkohli and the team a great match tomorrow. https://t.co/NXKw6cxLRg
— N Chandrababu Naidu (@ncbn) October 23, 2018
అయిదు వన్డేల సిరీస్‌లలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం విశాఖ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు జట్లు విశాఖపట్నంకు చేరుకున్నాయి. మంగళవారం తాను బస చేసిన హోటల్ నుంచి కోహ్లి సముద్రం కనబడేలా ఫోటో తీసుకుని దాన్ని ట్వీట్ చేశాడు. విశాఖ అందాలకు ముగ్ధుడయ్యాడు.

విశాఖపట్నం దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ట్వీట్ చేశారు. అలాగే, బుధవారం విశాఖపట్నం వన్డే సందర్భంగా కోహ్లి సేనకు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై నెటిజన్లు చంద్రబాబుకు అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications