బెజవాడలో బంధువు ఉదారాత: చంద్రబాబుకు రెస్ట్ హౌస్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంధువు రెస్ట్ హౌస్‌ను ఇస్తున్నారు. విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండడానికి ఆ ఇల్లు అన్ని హంగులనూ సిద్ధం చేసుకుంటోంది.

రెండు అంతస్థుల ఆ భవనం చంద్రబాబు నాయుడి బంధువుది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ అతిథి గృహం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఇల్లు ఐదో జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పడుతుందని భావిస్తున్న నాగార్జున విశ్వవిద్యాలయానికి, గన్నవరం విమానాశ్రయానికి మధ్యలో ఆ భవనం ఉంది.

Chandrababu offered rest house by relative

సోమవారంనాడు ఆ భవనంలో హై కెపాసిటీ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. భవనం చుట్టూ స్పీడ్ బ్రేకర్లు వచ్చేశాయి. అధికారులు ఇటీవల ఆ భవనాన్ని పరిశీలించారు. సెక్యూరిటీ ప్లాన్ తయారు చేయడానికి ఫొటోలు కూడా తీసుకున్నారు.

ఇంటికి సమీపంలో ఉన్న కారు గ్యారేజీని ఖాళీ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. రెండు నెలల్లోగా ఖాళీ చేయాలని కారు గ్యారేజీ యజమానిని ఆదేశించారు. ఈ ఇంటిని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పలుమార్లు సందర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+