Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ముసలివారు , లోకేష్ పులకేసి.. టీడీపీకి కొత్త నాయకుడు కావాలన్న మంత్రి

Recommended Video

    టీడీపీని నడిపించటం చంద్రబాబు, లోకేష్ వల్ల కాదు | Anil Kumar Yadav Comments On Chandrababu and Lokesh

    ఇప్పుడు ఏపీలో సీఎం మొదలుకొని వైసీపీకి చెందిన నాయకుల ప్రతి ఒక్కరి టార్గెట్ వారే చంద్రబాబు, లోకేష్ . ఎవరికి వారు టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబుపై, ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్ పై విరుచుకుపడుతున్నారు . ఇక తాజాగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్ ల వల్ల టీడీపీ ముందుకు నడవదని కొత్త నాయకుడు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    లోకేష్ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేసిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్

    లోకేష్ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేసిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్

    ఇటీవల కాలంలో లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. ఇక లోకేష్ ట్విట్టర్ పోస్ట్ లపై స్పందించిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చంద్రబాబు తనయుడు లోకేశ్‌ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ ట్వీట్‌లు ఆయనే చేస్తున్నారో.. లేక ఎవరితోనైనా రాయిస్తున్నారో కూడా తెలియదన్నారు. లోకేష్ కు ట్వీట్లు రాసేంత తెలివి వుందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి ట్విట్టర్ చిలుక..ట్విట్టర్ పలుకులు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్.

    టీడీపీని నడిపించటం వారిద్దరి వల్ల కాదన్న మంత్రి

    టీడీపీని నడిపించటం వారిద్దరి వల్ల కాదన్న మంత్రి

    టీడీపీలో చంద్రబాబు తర్వాతి నాయకుడు ఎవరిని ఆ పార్టీ నేతలు వెతుక్కుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం ఉందన్నారు. తెలుగు దేశం పార్టీని నడిపించటం వారిద్దరి వల్ల కాదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు ముసలివారయ్యారని , ఇక లోకేష్ పులికేసి లాంటివారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీకి నూతన నాయకుడు అవసరం వచ్చిందన్న అనీల్ కుమార్ యాదవ్ అందువల్లే టీడీపీలో తర్వాత నాయకుడు ఎవరు అని ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారని పేర్కొన్నారు.

    విభజన సమస్యలు పరిష్కారం అయితే జగన్ కు పేరొస్తుందని టీడీపీ భయం అన్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్

    విభజన సమస్యలు పరిష్కారం అయితే జగన్ కు పేరొస్తుందని టీడీపీ భయం అన్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్

    ఇక జగన్ నెల రోజులపాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇక కేసీఆర్ తో జరుగుతున్న చర్చల గురించి రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయాయని పరస్పరం సహకార ధోరణిలో ఉంటూ సమస్కలు పరిష్కరించుకోవాలన్నారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ . గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. విభజన సమస్యలన్నీ పూర్తయిపోతే సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే టీడీపీ నేతలు భయపడుతున్నారని ఆయన విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు కృషి​ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+