అన్నక్యాంటిన్లు ఆకర్షణీయంగా ఉండాలి...సీఆర్డీఏ సమీక్షలో చంద్రబాబు
అమరావతి:రాష్ట్రంలో నెలకొల్పే అన్న క్యాంటిన్లను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సిఆర్డిఏ సమీక్షా సమావేశంలో ఆయన అన్న క్యాంటిన్ల ఏర్పాటు విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 148 అన్న క్యాంటీన్ల కోసం స్థలాలు గుర్తించామని, వాటలో ఇప్పటికే వంద స్థలాలను అప్పగించేశామని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఆకర్షణీయంగా, పార్కింగ్‌కు వీలు ఉండాలని, చుట్టూ మొక్కలు పెంచి చూడగానే కళ్లకు అందంగా, అక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉండేలాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం రాజధాని ప్రాంతంలో సంస్థల వారీగా నిర్మాణాల పురోగతిపై వివరాల గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించారు. చేపట్టే నిర్మాణాలు అన్నీ చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉండాలని సిఎం సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణంపై వర్చువల్ రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ నిర్మాణ పనుల పురోగతిని సైతం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షిస్తానని చెప్పారు. భూముల కేటాయింపు, టెండర్ షెడ్యూల్స్, ప్రాజెక్టుల తాజా సమాచారం, వాటర్ ఫ్రంట్ ఇంజనీరింగ్‌పై అధికారులతో చంద్రబాబు చర్చించారు.












Click it and Unblock the Notifications