కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమా కోసం అవసరమైతే హెలికాప్టర్: చంద్రబాబు ఆదేశం, అఖిలప్రియ ఆందోళన

నంద్యాల ఎమ్మెల్యే, టిడిపి నేత భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. దీనిపై ఏపీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అవసరమైతే హెలికాప్టర్ వాడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే, టిడిపి నేత భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. దీనిపై ఏపీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అవసరమైతే హెలికాప్టర్ వాడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

భూమా నాగిరెడ్డి గురించి తెలియగానే చంద్రబాబు కర్నూల్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. అవసరమైతే వెంటనే హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు.

bhuma nagireddy

అహోబిలం నుంచి హుటాహుటిన అఖిలప్రియ

తండ్రికి గుండెపోటు రావడంతో ఆయన కూతురు అఖిల ప్రియ హుటాహుటిన అహోబిలం నుంచి నంద్యాలకు వస్తున్నారు. తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆమెతో ఫోన్లో మాట్లాడారు.

గతంలో రెండుసార్లు గుండెపోటు

భూమా నాగిరెడ్డికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆయనకు గుండెపోటు ఇది మూడోసారి. ఓసారి గుండెకు ఆపరేషన్ కూడా అయింది. కొద్ది నెలల క్రితం స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత బాగానే ఉంది. తిరిగి ఆదివారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.

English summary
AP CM Chandrababu Naidu ordered district collector to use Helicopter for Bhuma Nagi Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X