బాబు ఆస్తులు రూ. 48 లక్షలు: భార్యవి రూ. 134 కోట్లు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆస్తులు, అప్పుల వివరాలను ఎన్నికల నామినేషన్ పత్రంతో పాటు జత చేశారు.చంద్రబాబు కంటే ఆయన భార్య భువనేశ్వరికి ఎక్కువ ఆస్తులున్నట్టు గురువారం కుప్పంలో నారా లోకేష్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
చంద్రబాబు వ్యక్తిగత ఆస్తి మొత్తం 47లక్షల 95వేల 239 రూపాయలు కాగా ఆయన సతీమణి భువనేశ్వరి మొత్తం ఆస్తి విలువ 134 కోట్ల 32లక్షల 16వేల 489 రూపాయలుగా పొందుపరిచారు. తనకు సొంత అంబాసిడర్‌కారు, 1000 రూపాయలు విలువ కలిగిన నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్లు ఉండగా మిగిలిన మొత్తం బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్లు రూపంలో ఉందన్నారు.

భార్య భువనేశ్వరికి 92లక్షల విలువ కలిగిన ఆడి కారు, రెండు కెజిల, 892గ్రాముల బంగారు నగలు, 35కేజిల వెండి, 67.5 లక్షల విలువ కలిగిన నవరత్నాలు, ముత్యాల ఆభరణాలు ఉన్నాయన్నారు. హెరిటేజ్, విజయాబ్యాంకుతోపాటు పలు అన్‌లిమిటెడ్ కంపెనీల్లో వంద కోట్లకు పైబడిన షేర్లు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు 6,35వేల 387 రూపాయల అప్పు, భార్య భువనేశ్వరికి 16కోట్ల 5లక్షల 28వేల అప్పు ఉన్నట్టు అఫిడవిట్‌లో వివరించారు.
బొబ్బిలి కోర్టులో బాబు ప్రమాణం
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నామినేషన్‌ను చిత్తూరు జిల్లా కుప్పంలో దాఖలు చేసినప్పటికీ, ప్రమాణం మాత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో చేయడం గమనార్హం. గురువారం చంద్రబాబునాయుడు నామినేషన్ పత్రాన్ని ఆయన తనయుడు లోకేష్ కుప్పంలో దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications