బతుకమ్మను తలపై ఎత్తుకున్న చంద్రబాబు (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో మంగళవారం బతుకమ్మ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తలపై బతుకమ్మను పెట్టుకుని మోశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతోపాటు తెలంగాణ సమస్యలు కూడా ప్రస్తావిస్తున్నానని ఆయన చెప్పారు.

మళ్లీ తెలుగు జాతిని పూర్తిగా కలిపే పార్టీ తెలుగుదేశం తప్ప మరేది కాదని ఆయన అన్నారు. కొత్త రాజధానిలో తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మ పవిత్రమైన పండుగ అని, కష్టజీవుల పండుగ అని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో బతుకమ్మ ఒక్కటే పూల పండుగ అని ఆయన అన్నారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

దేవతలు పూజించే పండుగలు అనేకం ఉండవచ్చునని, అయితే ప్రకృతిని పూజించే పండుగ ఇదొక్కటేనని చంద్రబాబు తెలిపారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

కూకట్‌పల్లిలోని బతుకమ్మ వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతులు ఇలా దాండియా ఆడారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

హైదరాబాదులోని కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు టిడిపి ఎంపి మల్లా రెడ్డి కూడా పాల్గొన్నారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

హైదరాబాదులోని కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

నారా చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బతుకమ్మను తలపై మోశారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు అక్కడి మహిళలతో ముచ్చటించారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నారా చంద్రబాబు నాయుడు ఓ చిన్నారితో ఇలా కనిపించారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలతో చేతులు కలిపి ఆడేందుకు ప్రయత్నించారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

హైదరాబాదులోని కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు యువతులతో కరచాలనం చేస్తూ ఇలా కనిపించారు.

బతుకమ్మను మోసిన బాబు

బతుకమ్మను మోసిన బాబు

హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఇలా దాండియా గురించి తెలుసుకుంటూ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+